తెలంగాణలో మ్యాజిక్ ఫిగర్ సాధిస్తాం.. ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-08 08:27:43.0  )
తెలంగాణలో మ్యాజిక్ ఫిగర్ సాధిస్తాం.. ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ తెలంగాణలో తమ పార్టీ గెలుచుకునే సీట్లపై జోస్యం చెప్పారు. తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ మ్యాజిక్ ఫిగర్ సాధిస్తుందన్నారు. పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కాదన్నారు. తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ బలమైన శక్తిగా ఆవిర్భవించబోతోందన్నారు. ఇతర పార్టీల్లో టికెట్లు రానివారు.. ప్రజాశాంతి పార్టీలో చేరితే ఎమ్మెల్యే చేస్తానని స్పష్టం చేశారు. ఇక, ప్రజాశాంతి పార్టీ ఈనెల 6న 12 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 344 మంది అప్లై చేసుకున్నట్లు కేఏ పాల్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed