- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Etela Rajender : పేదలకు ఫ్రీగా వైద్యం అందిస్తాం.. : ఈటల
దిశ, బడంగ్పేట్ : ఈ కురు క్షేత్ర సంగ్రామంలో 100మంది కౌరవులు ఉన్నా, చివరికి పాండవులదే అంతిమ విజయమని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఒక వేళ బీఆర్‌ఎస్ వాళ్లు తాగిపిచ్చినా, తినిపిచ్చినా హుజురాబాద్‌లాగా ఓటుకు రూ.10వేలు ఇచ్చినా ఆత్మ గౌరవం బావుటా ఎగురవేసి ధర్మాన్ని నిలపాలని కోరారు. పువ్వు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు. బడంగ్పేట్ మల్లాపూర్ చౌరస్తాలో మంగళవారం రాత్రి అందెల శ్రీరాములు చేపట్టిన 13వ రోజు పాదయాత్రకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మద్దతు పలికారు.
అనంతరం మల్లాపూర్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో ఈటెల రాజేందర్, ఆచార్యతో కలిసి మాట్లాడారు. రింగురోడ్డు చుట్టూ 5800 ఎకరాల భూములను కాజేసిన ఘనత కేసీఆర్ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. తెలంగాణలో ఎప్పుడు ఉప ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ మాత్రమే గెలుస్తూ వచ్చిందన్నారు. అధికార మదంతో... పైసల దందాతో.. ప్రలోభాలతో బీఆర్ఎస్గెలిచింది తప్పా కాంగ్రెస్పార్టీ మాత్రం ఎన్నడూ గెలువలేదన్నారు. జీహెచ్‌ఎంసి ఎన్నికల్లో మీ క్యాడర్ ఎక్కడ? అని అహంభావంతో కేసీఆర్ విర్రవీగాడన్నారు. చివరికి హైదరాబాద్ మున్సిపల్ఎన్నికల్లో 48 కార్పొరేటర్లను ప్రజానీకం గెలిపించారన్నారు.
మొన్న హైదరాబాద్ టీచర్స్ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ రూ.100 కోట్లు ఖర్చు పెట్టినా చివరకు బీజేపీనే గెలిచిందన్నారు. పేదల కోసమే పుట్టినా అని చెప్పుకుంటున్న కేసీఆర్9 సంవత్సరాల పాలనలో ఒక్క పేద బిడ్డకయినా డబుల్ బెడ్ రూమ్ ఇచ్చాడా? అని ప్రశ్నించారు. పేద కుటుంబంలో భర్తకు వస్తే భార్యకు ఫించన్రాదు. భార్యకు వస్తే భర్తకు ఫించన్ రావడం లేదని ఫైర్ అయ్యారు. బీజేపీ అధికారంలోకి వస్తే తప్పకుండా పేదింటి భార్యభర్తలిద్దరికి ఫించన్‌లు ఇచ్చే ఆలోచన చేస్తుందన్నారు. దేశంలో 303 సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ గత 9 సంవత్సరాలుగా ఎక్కడ కూడా స్కాములు చేయలేదన్నారు.
బీజేపీనీ గెలిపిస్తే..
బీజేపీని గెలిపిస్తే 50 సంవత్సరాలు నిండిన వారికి తప్పకుండా ఫించన్ ఇస్తామని ఆ ఇచ్చే భాద్యత నాదని హామీ ఇచ్చారు. భారతీయజనతా పార్టీ అధికారంలోకి వస్తే పేదింటి పిల్లలకు ప్రభుత్వ పరంగా నాణ్యమైన విద్య అందించే జిమ్మదారు మాది అని హామి ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియం విద్య ప్రయివేట్ స్కూల్‌కు ధీటయినా విద్య పైసా ఖర్చుకాకుండా పేదలకు అందిస్తామన్నారు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఆయుష్మాన్భారత్ పేరిట అమలు చేస్తుందన్నారు.
రాబోయే కాలంలో పేదలకు రూపాయి ఖర్చు లేకుండా వైద్య మిప్పించే భాద్యత కూడా తప్పకుండా మేము తీసుకుంటామన్నారు. కేసీఆర్ మాకు పింఛన్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు ఇస్తున్నాడని అనుకుంటారు... కానీ ఒక్క విషయం ఆలోచన చేయాలన్నారు. 2014లో నేను ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో తాగుడు ద్వారా 10700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి కట్టామని, ప్రస్తుతం లిక్కర్ తాగి 45వేల కోట్ల రూపాయలు కేసీఆర్ప్రభుత్వానికి కడుతున్నామన్నారు.
పుస్తెల తాడు కట్టడానికి కళ్యాణ లక్ష్మి పేరు మీద ఇచ్చే డబ్బు సంవత్సారానికి 2వేల 500 కోట్ల రూపాయలు, పించన్లకు సంవత్సరానికి ఇచ్చే డబ్బు 11వేల కోట్ల రూపాయలు మాత్రమే అన్నారు. 13వేల కోట్ల రూపాయలు మనకిచ్చి 45వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నాడని కేసీఆర్ పై మండిపడ్డారు. దశాబ్ది ఉత్సవాల పేరిట తినిపించడం, తాగిపించడం మొదలు పెట్టాడని, ప్రజల మీద ప్రేమ లేదు కాన .. వాళ్లకు ఉన్నదల్లా మన ఓట్ల మీదనేనన్నారు. 100 పైబడి ఎమ్మెల్యేలు ఉన్నా.. అధికారం ఉన్నా.. అంతిమంగా ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ గడ్డ మీద గెలిచేది ధర్మమేనని, పువ్వు గుర్తుకు ఓటు వేసి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ఈటల రాజేందర్విజ్ఞప్తి చేశారు.
Read More: కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా?