- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెబల్స్ కారణంగా హర్యానాలో ఓడిపోయాం: ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అభివృద్ధి కోసం 23 సార్లు కాదని, అవసరమైతే 230 టైమ్స్ ఢిల్లీకి వెళ్తామని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తెలిపారు. ఢిల్లీ వెళ్తే తప్పేంటి? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ లాగా ఫామ్ హౌజ్ లో పడుకోవాలా? అంటూ చురకలు అంటించారు. మంగళవారం ఆయన అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ..ప్రజా పాలన ఓర్వలేక సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ను కేటీఆర్ విమర్శించడం సిగ్గు చేటన్నారు. కేటీఆర్ కు సిగ్గు శరం ఉన్నదా? అంటూ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి హోం మంత్రుల సమావేశం కోసం ఢిల్లీ వెళ్లారని, వరద సాయం విడుదల చేయాలని కేంద్రాన్ని సీఎం కోరారని గుర్తు చేశారు. దీన్ని కూడా రాజకీయం చేయడం కేసీఆర్ సంస్కారానికే వదిలేస్తున్నామన్నారు.
ప్రతిపక్ష నాయకుడు ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటు ఫాంహౌస్ లో పడుకుంటున్నాడని, తాము కూడా అలా వ్యవహరించాలంటే కుదరదని చెప్పుకొచ్చారు. కేసీఆర్ కనిపించడం లేదని ఇటీవల అక్కడి ప్రజలు గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, ఇంత దారుణమైన స్థితితో కేసీఆర్ ఉన్నాడని మండిపడ్డారు. ఢిల్లీకి ముడుపులు అందించే అలవాటు కేటీఆర్ కు ఉన్నదన్నారు. వాళ్ల చెల్లి బెయిల్ విషయంలో అదే చేశాడని గుర్తు చేశారు. తెలంగాణ బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని, కేటీఆర్ అడ్డగోలు మాటలు మానేస్తే బెటర్ అంటూ సూచించారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే, నాలుక చీరేస్తామని హెచ్చరించారు. హర్యానాలో రెబల్స్ కారణంగానే కాంగ్రెస్ ఓటమి పాలైందని, రాబోయే రోజుల్లో రాహుల్ ను పీఎం చేస్తామని ప్రకటించారు.