మేము యుద్ధాన్ని కోరుకోం.. కానీ, శక్తిని పూజిస్తాం: ఇండియా కూటమిపై అర్వింద్ సెటైరికల్ ట్వీట్

by Shiva |   ( Updated:2024-05-26 13:10:17.0  )
మేము యుద్ధాన్ని కోరుకోం.. కానీ, శక్తిని పూజిస్తాం: ఇండియా కూటమిపై అర్వింద్ సెటైరికల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఆరో దశ ఎన్నికలు శనివారంతో ముగిశాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రంలో అధికారంలోకి వచ్చేది తమ పార్టీనే అంటూ కాంగ్రెస్, బీజేపీలు సవాళ్ల మీద సవాళ్లు విసురుకుంటున్నారు. ఓ వైపు కమలం పూర్తి టార్గెట్ 400 పేరుతో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తోంది. మరోవైపు కాంగ్రెస్ పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వంపై వచ్చిన ప్రతికూల వాతావరణమే ప్లస్ అవుతోందిన భావిస్తోంది. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దిపేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రచారాన్ని నిర్వహించింది.

ప్రస్తుతం ఎన్నికల వాతావరణ వేడెక్కడంతో రెండు పార్టీల నడుమ మాటల యుద్ధం కొనసాగుతోంది. దేశానికి మీరేం చేశారంటూ కాంగ్రెస్, బీజేపీని ప్రశ్నిస్తే.. కార్పొరేట్లకు దొచిపెడుతున్న మోడీ అంటూ బీజేపీపై హస్తం పార్టీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ క్రమంలోనే నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ట్విట్టర్ వేదికగా ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు. ‘మేము యుద్ధాన్ని కోరుకో.. కానీ, శక్తిని పూజిస్తాం! దేశానికి రెండు వైపుల అణు శక్తి కలిగిన దేశాలని పెట్టుకుని అణ్వాయుధాలను పూర్తిగా తొలగిస్తామంటున్న ఇండియా కూటమి’ అంటూ సైటర్లు వేశారు.‘అందుకే శక్తివంతమైన నాయకత్వం దేశానికి అత్యవసరం’ అని ట్వీట్ చేశారు.

Click Here For Twitter Post..

Advertisement

Next Story