ACB Raids: ఆ అవినీతి అధికారిని చేజ్ చేసి పట్టుకున్నాం.. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh N |
ACB Raids: ఆ అవినీతి అధికారిని చేజ్ చేసి పట్టుకున్నాం.. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. తాజాగా సీసీఎస్‌ సీఐ సుధాకర్‌ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తాజాగా మీడియాతో మాట్లాడారు. సీసీఎస్‌ సీఐ సుధాకర్‌ తనను వేధిస్తున్నాడని మణిరంగ స్వామి అనే వ్యక్తి ఇటీవల ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఓ కేసు క్లోజ్ చేయడానికి 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు సీఐ. రూ. 5 లక్షలు ఇచ్చారని, మిగిత డబ్బులు తీసుకురావాలని తనపై ప్రెజర్ పెట్టారని బాధితుడు కంప్లైంట్ ఇచ్చినట్లు స్పష్టంచేశారు. సీఐ అడిగినంత కాకుండా ఫిర్యాదు దారుడు రూ. 3 లక్షలు ఇస్తానని సీఐకి చెప్పాడు. అందుకు సీఐ ఒప్పుకోవడంతో ఈవెనింగ్ టైం ఇవ్వాలని సీఐ చెప్పినట్లు గుర్తు చేశారు. ఆ వ్యక్తి సీఐకి రూ.3 లక్షలు ఇవ్వడానికి వెళ్లే సమయంలో ట్రాప్ పార్టీ అంత కూడా సీసీఎస్ ముందు పొజిషన్ ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.

ఆ టైమ్‌లో అతనికి కొంచెం అనుమానంగా అనిపించి అలర్ట్ అయ్యారని పేర్కొన్నారు. పార్కింగ్ ప్లేస్‌లో వారిని వెయిట్ చేయమని సీఐ చెప్పారని వెల్లడించారు. కిందకి వచ్చిన సీఐ తన బ్యాక్ ప్యాక్‌లో నగదు పెట్టాలని సైగ చేశాడన్నారు. ఆ సమయంలో ఏసీబీ టీమ్ మూవ్ అయి పట్టుకునే ప్రయత్నం చేయగా.. పరిగెత్తాడు. 20, 30 మీటర్లు చేజ్ చేసి.. ఆ అధికారిని పట్టుకున్నామన్నారు. క్యాష్ కూడా రికవరీ చేసినట్లు స్పష్టంచేశారు. మరిన్ని విషయాలు రాబట్టేందుకు సీఐని విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే పై అధికారులతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఏసీపీ రామ్‌రెడ్డిని కూడా ఎంక్వైరీ చేసినట్లు డీఎస్పీ శ్రీధర్ చెప్పారు. అయితే, బాధితుల్లో లంచంపై అవేర్నెస్ పెరిగిందని, ఏసీబీపై నమ్మకంతో టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు కాల్స్ పదింతలు పెరిగాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed