మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం.. ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-20 07:04:54.0  )
మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం.. ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లులో ముస్లిం, ఓబీసీ వర్గాల మహిళల కోటాను చేర్చేలేదన్నారు. ముస్లిం, ఓబీసీ వర్గాలకు చెందిన మహిళలకు బిల్లులో కోటా లేకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తోందని అందుకే బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు 17 సార్లు లోక్ సభ ఎన్నికలు జరగగా 8,992 మంది ఎంపీలు ఎన్నికయ్యారని, వారిలో 520 మంది మాత్రమే ముస్లింలు ఉన్నారన్నారు. వారిలోనూ కొద్ది మంది మాత్రమే మహిళలు ఉన్నారన్నారు. ఇక, పార్లమెంట్ లో కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ మంగళవారం మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ఆమోదం పొందితే ఎంపీల సంఖ్య 82 నుంచి 181కి చేరనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

Advertisement

Next Story