- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు అలా జరగడం చాలా బాధకరం.. జెడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతిరెడ్డి
దిశ, శాయంపేట: హన్మకొండ జిల్లా, శాయంపేట మండలంలోని ఆరేపల్లి గ్రామంలో అకాల వర్షాలకుదెబ్బతిన్న మొక్కజొన్న పంటలను వరంగల్ జెడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతిరెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పనిచేసి పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని రైతులకు నష్టం కలగటం చాలా బాధాకరమన్నారు. వ్యవసాయ శాఖ అధికారులకు పంట నష్టాన్ని సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పంట నష్టాన్ని సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి నష్ట పరిహారం వచ్చేలా ప్రయత్నం చేస్తామని తెలిపారు. అనంతరం 2022 సంవత్సర క్యాలెండర్లను రైతులకు, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు పంపిణీ చేశారు.
ప్రత్తిపాక గ్రామ పంచాయతీని సందర్శించి గ్రామంలో ఉన్న నీటి సమస్యను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రైతులతో మాట్లాడి పంట నష్టం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రామంలో నిర్మించిన సెగ్రియేషన్ షేడ్, డంపింగ్ యార్డ్, స్మశాన వాటికల గురించి MRO, MPDO మరియు ప్రజాప్రతినధులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మనోహర్ రెడ్డి, MRO, MPDO, JDA, AO, AEO, గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు యూత్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.