- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అధికారంలోకి వస్తే మొదటి సంతకం దానిపైనే.. YS Sharmila
దిశ, నెక్కొండ: వైఎస్సార్ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర చెన్నారావుపేట మండలంలో గురువారం మొదలైంది. లింగగిరి లో వైఎస్ ఆర్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి షర్మిల నివాళులర్పించారు. పాదయాత్ర భారీ పోలీసు బందోబస్తు నడుమ కొనసాగింది. శంకరమ్మ తండా, లింగగిరి గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ.. వారి సమస్యలను తెలుసుకున్నారు. అక్కడ నుండి షర్మిల పాదయాత్ర సాయంత్రానికి నెక్కొండ చేరుకుంది.
నెక్కొండ సెంటర్ లో షర్మిల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ లో ప్రభుత్వం అప్పుల పాలయ్యిందని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. అధికారంలోకి వస్తే మొదటి సంతకం నిరుద్యోగుల ఫైల్ పైనే పెడతామని హామీ ఇచ్చారు. ఈ పాదయాత్రలో వరంగల్, హన్మకొండ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు, నర్సంపేట కో-ఆర్డినేటర్ నాడెం శాంతి కుమార్, నాయకులు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.