- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం: ఎమ్మెల్యే సతీష్ కుమార్
దిశ, వేలేరు: అన్ని వర్గాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అవసరాలను గుర్తించి వారికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ అన్నారు. సోమవారం వేలేరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం, మన ఊరు - మన బడి, రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు.
రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.రాష్ట్రంలో సంపూర్ణ అంధత్వ నిర్మూలన కోసం కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. మన ఊరు-మన బడి ఒక అద్భుత పథకమని దీని ద్వారా పాఠశాలలు సుందరంగా తయారవుతున్నాయని చెప్పారు.
ఎర్రబెల్లిలో ప్రైమరీ పాఠశాలలో మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా రూ.16.52 లక్షలతో చేపట్టిన పనులను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, ఎంపీపీలు కేశిరెడ్డి సమ్మిరెడ్డి, జక్కుల అనిత, సర్పంచ్ గూడ కవిత రాజ్ కుమార్, ఎంపీడీఓ జవహర్ రెడ్డి, ఎంఈఓ వేంకటేశ్వరరావు, మండల నోడల్ ఆఫీసర్ మహేష్ నాయక్, ఎస్ఎంసీ చైర్మన్ వి స్వాతి, హెచ్ఎం గణపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.