నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాంః మంత్రి సీతక్క

by Nagam Mallesh |   ( Updated:2024-09-02 09:46:43.0  )
నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాంః మంత్రి సీతక్క
X

దిశ, నెల్లికుదురుః నష్టమైన ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం అర్ధరాత్రి కుండపోత వర్షం కురవడంతో ఐదు చెరువులు తెగి మండలంలోని రావిరాల చెరువులోకి వరద చేరడంతో చెరువుకు గండి పడి గొర్లు బర్లు చనిపోయాయి. గృహాలు వరద తాకిడికి నేలమట్టమయ్యాయి. సోమవారం నష్టపోయిన వారిని ఓదారుస్తూ ప్రతి కుటుంబాన్ని కలుస్తూ భరోసా ఇచ్చారు. ఎంత నష్టం జరిగిందన్న దానిపై అధికారులను అడిగి తెలుసుకొని ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళి నాయక్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పి రామ్నాథ్ కేకన్, డీఎస్పీలు, ఎస్సైలు, జిల్లా, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి పర్యటనలో డిఎస్పీకి అస్వస్థత..

మంత్రి సీతక్క పర్యటనలో రావిరాల గ్రామంలో తిరుగుతుండగా తొర్రూర్ డిఎస్పి సురేష్ కొంత అస్వస్థకు గురికాగా వెంటనే అందుబాటులో ఉన్న వైద్య అధికారులు స్పందించి కారులో కూర్చోబెట్టి ట్రీట్మెంట్ అందించడంతో విశ్రాంతి తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed

    null