- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NTR: స్టార్ హీరోయిన్ కూతురికి ఎన్టీఆర్ స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలిస్తే వావ్ అనాల్సిందే..!
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్(Ranbir Kapoor)- అలియా భట్ (Alia Bhatt)ల గురించి స్పెషల్‌గా చప్పనక్కర్లేదు. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట 14 ఏప్రిల్ 2022న ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి నవంబర్ 6 2022న రాహా(Raaha) అనే పాప కూడా జన్మించింది. అయితే తాజాగా తన గారాలపట్టి పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అలియా ఓ ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టింది. అయితే ఈ చిన్నారి బర్త్‌డేకి యంగ్ టైగర్ ఎన్టీఆర్(Young Tiger NTR) ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బేసిక్‌గా తారక్ ఫ్రెండ్షిప్‌కి ఎంత వాల్యూ ఇస్తాడో మనందరికీ బాగా తెలుసు. మరీ ముఖ్యంగా తారక్‌కి ఇండస్ట్రీలో లేడీ ఫ్రెండ్స్ చాలా తక్కువ. వాళ్ళల్లో ఒకరే ఆలియా భట్. బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ అలియాభట్ అంటే ఎన్టీఆర్‌కి చాలా ఇష్టమట. ఎంతలా అంటే ‘దేవర’(Devara) సినిమాలో ఆమెనే హీరోయిన్‌గా పెట్టుకోవాలి అంటూ చాలా ట్రై చేశారట. కానీ కొన్ని కారణాల చేత అలియా భట్ ఆ సినిమాను రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత ఆ ప్లేస్‌లోకి జాన్వీ కపూర్(Janhvi Kapoor) వచ్చిందన్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా అలియా భట్ కూతురు రాహా బర్తడేని కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్‌గా సెలబ్రేట్ చేశారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్.. అలియా భట్ కూతురు కోసం ఓ స్పెషల్‌గా గిఫ్ట్‌ని సెండ్ చేశారట. ఆ రోజు పిల్లలకి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా ఒక స్పెషల్ బాక్స్‌లో రాహా ఆడుకునే విధంగా ఒక గిఫ్ట్ బాక్స్ పంపించారట. అంతేకాదు అందులో రాహా ఫొటోస్ కూడా యాడ్ చేశారట. దీంతో అలియాభట్ చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతూ తారక్‌కు స్పెషల్ థాంక్స్ చెప్పిందట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు.. తారక్ ఫ్రెండ్షిప్‌కి అంత వాల్యూ ఇస్తాడు అని చెప్పడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.