- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కార్తీక వనసమారాధనలు కాదు.. కుల వనసమారాధనలు
దిశ, పాలకొల్లు: ప్రస్తుత కాలంలో ఏపీలో కార్తీక వన సమారాధనలు (పిక్నిక్) రూపు రేఖలు మారిపోయినట్లు కనిపిస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్వం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద నైమిశారణ్యంలో మునులందరూ సూత మహర్షి ఆధ్వర్యంలో పచ్చటి చెట్లు, జమ్మి, ఉసిరి చెట్లు మధ్య శివ కేశవులను ఆహ్వానించి బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు పరివార సభ్యులతో కలిసి ఆరాధించి ప్రకృతితో మమేకమై కులమత భేదాలు లేకుండా భోజనాలు చేసే వారని పురాణాలు చెబుతున్నాయి. దీనివల్ల చక్కటి ఆరోగ్యం, కులాల మధ్య ఐకమత్యం ఉండేదని పూర్వీకులు చెబుతున్నారు.
కుల వన సమారాధనలు ఇలా..
కార్తీక వన సమారాధనలు రాను రాను కొందరి స్వార్థ బుద్ధితో కుల వన సమాధారాధనగా మారిపోయాయని పలువురు అంటున్నారు. కార్తీక వన సమారాధన కాస్త కులవన సమారాధనగా మారిపోవడంతో కులాల మధ్య ఐకమత్యం లోపించి కులాలు, వర్గాలుగా విడిపోయాయని అంటున్నారు. దీనివల్ల దైనందిన జీవితంలో వ్యాపారాల్లో స్వకులస్తులకే మద్దతు పలికే దుస్థితి ఏర్పడిందని, దీనివల్ల ఇతర కులాలకు కొన్ని కులాలు దూరమయ్యే పరిస్థితి ఉందని అంటున్నారు. అదే కనుక పూర్వ పద్ధతిలో వన సమారాధన జరుపుకుంటే అన్ని కులాలు ఐకమత్యంగా ఉండేవని, అన్ని కులాలు అభివృద్ధి సాధించేవని పలువురు అంటున్నారు.
రాజకీయ వేదికలుగా మారిన వైనం..
కార్తీక మాసం వన సమారాధనలు రాను రాను.. కుల వనసమారాధనలుగా విడిపోయాయి. ఏ కులం వారు ఆ కులం కలిసి మాత్రమే కార్తీక వన సమారాధన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. అంతటితో ఆగకుండా ఈ కులాల వన సమారాధన కార్యక్రమాలను రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసం వేదికలుగా మార్చుకుంటున్నారు. దీంతో రాజకీయ నాయకులు అన్ని కులాల వన సమారాధన కార్యక్రమాలకు హాజరై ఆయా కులాలకు అది చేస్తాం, ఇది చేస్తామంటూ హామీలు ఇచ్చేస్తున్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, ఎదగాలని పిలుపునిస్తున్నారు. దీంతో కార్తీక వనమారాధన కాస్త , కులవన సమారాధనగా మారి మరింత పటిష్టంగా మారుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సామాజిక ఐకమత్యం విచ్ఛిన్నమై ప్రమాదక పరిస్థితులు వస్తున్నాయని పలువురు అంటున్నారు. కావున, ఇకనైనా తెలుసుకుని ఈ కులాల వన సమారాధన నుంచి బయటపడి పూర్వకాలంలో ఉండే కార్తీక వన సమారాధన పరిస్థితి రావాలని, అప్పుడే సామాజిక ఐకమత్యం చేకూరుతుందని, సమాజాభివృద్ధి బాగా జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.