- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Budget: బడ్జెట్‌పై హెచ్ఓడీల నిర్లక్ష్యం.. ప్రతిపాదనలు పంపించడంలో ఆలస్యం!
దిశ, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ బడ్జెట్ రూపకల్పనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. దీంతో ఇంతవరకు బడ్జెట్‌కు సంబంధించిన ప్రతిపానదలు పంపించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయా విభాగాలకు సంబంధించిన ప్రతిపాదనలు, ఖర్చులకు సంబంధించిన వివరాలు ఇవ్వడానికి అధికారులు ముందుకు రావాడంలేదని ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా ఇంజినీరింగ్ విభాగంలో జోన్లవారీగా ప్రతిపాదనలు ఇవ్వాలని సంబంధిత సూపరింటెండెంట్ ఇంజినీర్లను అడిగితే ఇంతవరకు ఇవ్వకపోవడంతో సదరు అధికారులకు మెమోలు జారీచేసినట్టు తెలిసింది. ఆయా విభాగాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని ప్రచారం జరుగుతున్నది.
బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ ఇలా..
జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం సెప్టెంబర్ 25 లోపు సంబంధిత విభాగాల అధిపతులు బడ్జెట్ తయారిపై బాధ్యత తీసుకుని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాలి. ఆ తర్వాత బడ్జెట్ గురించి ప్రతిపాదనలు ప్రాసెస్ చేయాలని కమిషనర్ నుంచి సర్క్యూలర్ హెచ్ఓడీలకు 1 అక్టోబర్ లోపు పంపించాల్సి ఉంటుంది. దీంతోపాటు ఆయా విభాగాల వారీగా బడ్జెట్‌కు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించి హెచ్ఓడీల ద్వారా కమిషనర్‌కు 10 అక్టోబర్ లోపు పంపించాలి. కమిషనర్ వాటిని పరిశీలించిన తర్వాత విభాగాల సమీక్షించిన ప్రతిపాదనల్లో ఏమైనా మార్పులుంటే సరిచేసి 25 అక్టోబర్ లోపు పైనల్ చేయాల్సి ఉంటుంది.
అనంతరం నవంబర్ 10 లోపు బడ్జెట్ ప్రతిపాదనలను స్టాండింగ్ కమిటీ ముందు కమిషనర్ పెట్టాల్సి ఉంటుంది. అయితే బడ్జెట్ ప్రతులను సభ్యుల అధ్యయనం చేయడంతో సమావేశంలో చర్చించి, మార్పులు, చేర్పులుంటే సరిచేసి డిసెంబర్ 10 లోపు బడ్జెట్ బుక్ లెట్లను కార్పొరేటర్లకు పంపించాల్సి ఉంటుంది. స్టాండింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు బడ్జెట్ ప్రతులను అధ్యయనం చేయడంతో ఆమోదించడానికి నెల రోజులపాటు సమయం ఉంటుంది. 15 డిసెంబర్ లోపు బడ్జెట్ ప్రతిపాదనలను జనరల్ బాడీ సమావేశంలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఆ సమావేశంలో బడ్జెట్ గురించి కార్పొరేషన్ ఆమోదం పొందాల్సి ఉంటుంది.
అయితే జనరల్ బాడీ సమావేశంలో సభ్యుల నుంచి కొత్తగా వచ్చే ప్రతిపాదనలు, మార్పులు, అదనపు కేటాయింపులు, ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుని 20 ఫిబ్రవరి లోపు తుది బడ్జెట్‌ను రూపొందాల్సి ఉంటుంది. తర్వాత జనరల్ బాడీ ఆమోదించిన బడ్జెట్‌ను సమాచార నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలి. అనంతరం 1 మార్చిలోపు బడ్జెట్ కాపీలను ఎగ్జామినర్ అకౌంట్స్ అండ్ ఆడిటర్స్‌కు పంపించాలి. తర్వాత 15 రోజుల్లో అదనపు కేటాయింపులతో కూడిన బడ్జెట్ సమాచారాన్ని కమిషనర్ ద్వారా కార్పొరేషన్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత వచ్చే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఏప్రిల్ తర్వాత నుంచి అమలు చేయడానికి కమిషనర్ చర్యలు తీసుకుంటారని జీహెచ్ఎంసీ ఓ సీనియర్ అధికారి తెలిపారు.
నగరానికి కమిషనర్..
బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించడం, బడ్జెట్‌పై అధికారులు సలహాలు, సూచనలు, అదనపు కేటాయింపులు, ఇతర అంశాలపై చర్చించడానికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి నగరానికి రానున్నట్టు తెలిసింది. ఎన్నికల సంఘం అనుమతితో రెండు రోజులపాటు హైదరాబాద్‌లో ఉండాలని నిర్ణియించినట్టు సమాచారం. బడ్జెట్‌కు సంబంధించిన ప్రక్రియపై చర్చించనున్నారని అధికారవర్గాల సమాచారం. ఈనెల 20న జార్ఖండ్ ఎన్నికలు ఉండడంతో మధ్యలోనే రెండు రోజులపాటు వచ్చే అవకాశముందని తెలిసింది. అయితే రాష్ట్రంలో సమ్రగ ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణ, కమిషనర్ ఎన్నికల విధుల్లో వెళ్లడం కారణంగా షెడ్యూల్ ప్రకారం బడ్జెట్ రూపకల్పనలో కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.