- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం.. విచారణ జరిపించండి.
దిశ, గూడూరు : గూడూరు మండలం అయోధ్యపురం గ్రామపంచాయతీ లో నిధుల దుర్వినియోగం జరిగిందని గ్రామస్థులు మహబూబాబాద్ డివిజనల్ పంచాయితీ అధికారికి ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 2 వ తేదీన జరిగిన గ్రామసభలో పలు విషయాల పై చర్చించి గ్రామపంచాయతీ నిధుల పై కార్యదర్శిని గ్రామస్థులు వివరణ అడుగగా చేయని పనులకు మాజీ సర్పంచ్ బిల్లులు రికార్డు చేయించుకుని ఎంబి బుక్కులు, చెక్ బుక్ లను సర్పంచ్ ల పదవీకాలం గడిచిపోయి తొమ్మిది నెలలు కావస్తున్నా గ్రామపంచాయతీకి అప్పగించలేదని కార్యదర్శి తెలిపారు.
గ్రామసభ జరిగిన రోజున గ్రామ ప్రత్యేక అధికారి లేకపోవడంతో గ్రామస్తులు, కార్యదర్శి గ్రామసభను తిరిగి అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేశారు. అయితే గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగిందని వాటి పై సమగ్రంగా విచారణ జరిపి బాధ్యుల పై తగు చర్యలు తీసుకోవాలని, నేడు అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మోగులగని ప్రభాకర్, మదాసు రమేష్ , భీమగని శ్రీనివాస్, పూజారి శంకర్, ముత్యం సురేష్ లు పాల్గొన్నారు.