రోగుల బంధువుల నుంచి డబ్బులు.. ఇద్దరు సస్పెండ్

by Sathputhe Rajesh |
రోగుల బంధువుల నుంచి డబ్బులు..  ఇద్దరు సస్పెండ్
X

దిశ, హన్మకొండ టౌన్: వరంగల్ ఎమ్. జి.ఎమ్ కు వైద్యం కోసం వచ్చిన రోగులు, బంధువుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సస్పెండ్ చేసులని ఆర్.ఎం.ఓ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 3వ తేదీన మహబూబాబాద్ జిల్లాకు చెందిన హుసేన్ పాషాకు అనారోగ్యం కారణంగా కుటుంబ సభ్యులు వరంగల్ ఎమ్. జి.ఎమ్ కు తీసుకవచ్చారు. పరీక్షించిన వైద్యులు ఆర్.ఎల్.సి.యూలో బెడ్ కు సిఫారసు చేస్తూ కొన్ని వైద్య పరీక్షలు రాశారు. 4వ తేదీన ల్యాబ్ రిపోర్ట్స్ రాగా.. పరిశీలించిన వైద్యులు ఆక్సిజన్ అందించాలని ఆదేశించారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సదరు రోగి బంధువులను 2వేల 500 రూపాయలు డిమాండ్ చేశారు. రోగి బంధువులు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని గట్టిగా అడిగ్గా.. 1000 రూపాయలు ఇస్తేనే ఆక్సిజన్,మందులు ఇస్తామని సమాధానమిచ్చారు. దీంతో 1000 రూపాయలు ముట్టజెప్పారు. 5వ తేది అక్కడే విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ నర్స్ కు రోగి బంధువులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు.. ఈ సంఘటన తెలంగాణ ప్రభుత్వ ఖ్యాతిని దెబ్బతీసే విధంగా ఉందని, అందువల్ల సతీష్ ,శ్రీనివాస్ లను సస్పెండ్ చేయాలంటూ ఆర్.ఎం.ఓ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement

Next Story