క్రికెట్ ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్ట్..

by Kalyani |   ( Updated:2023-04-23 09:05:41.0  )
క్రికెట్ ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు అరెస్ట్..
X

దిశ, హనుమకొండ టౌన్: ఐపీఎల్ క్రికెట్ ఆన్ లైన్ బెట్టింగ్ లు నిర్వహిస్తున్న ఇద్దరినీ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. శనివారం హనమకొండ పట్టణంలోని గోకుల్‌నగర్ కు చెందిన వేల్పుల లక్ష్మణ్, వికాస్‌నగర్ కు చెందిన కన్నబోయిన సంజయ్ లు గుండ్ల సింగారం గ్రామంలో డఫాబెట్, నైస్ యాప్ ద్వారా క్రికెట్ ఆన్ లైన్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడి చేసి నిందితుల వద్ద నుంచి రూ. 60,100నగదు, రెండు స్మార్ట్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి చర్యల కోసం సుబేదారి పోలీసులకు అప్పగించారు.

Advertisement

Next Story