భావి తరాలకు స్ఫూర్తి అంబేడ్కర్ : మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు

by Sumithra |
భావి తరాలకు స్ఫూర్తి అంబేడ్కర్ : మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు
X

దిశ, కాటారం : భారత రాజ్యాంగ నిర్మాత, న్యాయ కోవిదుడు, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జీవితం ఆశయాలు దేశానికి చేసిన సేవభావితరాలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని కాటారం మండల కేంద్రంలోని జాతీయ రహదారి పై గల గార పెళ్లి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ కులవ్యవస్థను ఉపయోగించుకొని ముందుకు సాగాలని ఏనాడు చెప్పలేదని, నిర్మూలన జరగాలి ప్రజలందరూ సమానమే అని చెప్పిన గొప్పవ్యక్తిగా సమాజంలో నిలిచారని ఎంఎల్ఏ శ్రీధర్ బాబు అన్నారు. అంబేద్కర్ ను ఒక వర్గానికి పరిమితం చేస్తే అతని ఆశయాలకు భంగం కలిగించినట్లు అవుతుందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆలోచన పరున్ని దేశానికి దిక్సూచిని రాజ్యాంగ చైర్మన్ గా నియమించి వ్యవస్థలను ముందుకు తీసుకెళ్లింది అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజాస్వామ్యంలో నిర్మాణం చేసిన కొన్ని సంస్థలను పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని శ్రీధర్ బాబు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ గండ్ర సత్యనారాయణ రావు, కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు మంత్రి మధు, నాయకులు దండు రమేష్, చీర్ల తిరుమల తిరుపతిరెడ్డి, సర్పంచ్ అంగజాల అశోక్, ఆంగోతు సుగుణ, కుంభం స్వప్న, జాడి మహేశ్వరి, చీమల రాజు, కొట్టే శ్రీహరి, భాస్కర్ కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

Next Story