సీఎం కేసీఆర్‌పై TPCC చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్

by Satheesh |   ( Updated:2023-02-07 18:08:10.0  )
సీఎం కేసీఆర్‌పై TPCC చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్
X

దిశ, ములుగు ప్రతినిది- ఏటూరునాగారం: రాష్ట్ర వ్యాప్తంగా టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి త‌ల‌పెట్టిన హాత్ సే హాత్ పాద‌యాత్ర మంగ‌ళ‌వారం ఉద‌యం రామ‌ప్ప నుండి మొద‌లై సాయంత్రానికి ములుగుకు చేరుకుంది. ఈ సంద‌ర్భంగా ములుగులో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వాన్ని చూస్తుంటే బొంద పెట్టిన రాచరికం మ‌ళ్లీ క‌నిపిస్తుందన్నారు. ర‌జాకారుల పాల‌న మ‌ళ్లీ తెలంగాణ ప‌ల్లెల‌కు చేరిన‌ట్టు క‌నిపిస్తుంద‌న్నారు. వేలాది మంది పోరాటాల‌తో.. 1200 వంద‌ల మంది ఆత్మ బ‌లిదానాల‌తో తెలంగాణ వ‌చ్చింద‌న్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బ‌లిదానాలు చేసుకున్న యువ‌కుల‌, అమర‌వీరుల త్యాగాల‌ను ఈ ప్రభుత్వం కాల గ‌ర్భంలో క‌ప్పెయాల‌ని చూస్తుంద‌న్నారు.

సంక్షేమ రాష్ట్రం అంటే ఇదేనా..?

చంద్రశేఖ‌ర్ రావు ప‌క్కా రాష్ట్రల‌తో తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రాష్ట్రం అని చెపుతున్నారన్నారు. సంక్షేమం అంటే భ‌ర్తకు పించ‌న్ ఇచ్చి, భార్యకు పెన్షన్ ఇవ్వకుండా అవ‌మానించ‌డం సంక్షేమమా..? రైతులు చేసిన అప్పులు ల‌క్ష రూపాయాల రుణ మాఫీ చేస్తాన‌ని.. ల‌క్ష రూపాయాలు రెండు ల‌క్షలు అయ్యాయని మండిపడ్డారు. ప్రభుత్వం పంట కొన‌క‌పోవ‌డం వ‌ల‌న 10 వేల మంది రైతులు ఉరి వేసుకుని, పురుగుల మందు తాగి చ‌చ్చి స్మశానానికి వెళ్లడం సంక్షేమామా..? ఇంటికో ఉద్యోగం ఇస్తాన‌ని త‌న ఇంటిల్లి పాదికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాడని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, గిరిజన బంధు ఏమైందని నిలదీశారు.


దమ్ముంటే 119 స్థానాల్లో పోటీ చేయాలి: అసదుద్దీన్‌కు MP బండి సంజయ్ సవాల్

పార్లమెంటులో చర్చకు భయమెందుకు..?అదానీ కుట్రలు బట్టబయలు కావాల్సిందే

Advertisement

Next Story

Most Viewed