ఒకే కుటుంబంలో ముగ్గురు డాక్టర్లు

by Kavitha |
ఒకే కుటుంబంలో ముగ్గురు డాక్టర్లు
X

దిశ, దుగ్గొండి : వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన జాదవ్ డాక్టర్ నల్లబెల్లి చేరాలు (బిఏ ఎంఎస్) అంజూర దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక్క కుమారుడు ఉన్నారు. చేరాలు ఎనిమిది సంవత్సరాల క్రితం ఆయుష్మాన్ భారత్ లో ( ఆర్ బి యస్ కే ) వైద్యుడిగా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం సి హెచ్ ఎన్ సి గోదావరిఖని లో విధులు నిర్వహిస్తున్నారు. మూడవ కూతురు ప్రవళిక నాలుగేండ్ల క్రితం నీట్ లో ర్యాంక్ సాధించి సిద్ధిపేట మెడికల్ కళాశాలలో చేరారు. కుమారుడు కోమల్ భరద్వాజ్ ఇటీవల వెలువడిన నీట్ ఫలితాల్లో మంచి ర్యాంక్ ( 469) సాధించి నిర్మల్ మెడికల్ కళాశాలలో సీటు పొందారు. పెద్ద కుమార్తె ప్రభుత్వ పాఠశాలలో నాన్ టీచింగ్ ఉద్యోగం చేస్తుండగా, రెండవ కుమార్తె యం. ఫార్మసి చదువుతున్నారు. దుగ్గొండి మండల కేంద్రంలో ఒకే కుటుంబంలోని తండ్రి, కొడుకు, కూతురులు ఇంట్లో ముగ్గురు డాక్టర్ లు కావడం కుటుంబానికి కూడా గర్వ కారణంగా ఉందని డాక్టర్ చేరాలు అన్నారు.

Next Story

Most Viewed