తిమ్మన కుంట ఆక్రమణ భూ సర్వేను పరిశీలించిన సబ్ కలెక్టర్..

by Sumithra |
తిమ్మన కుంట ఆక్రమణ భూ సర్వేను పరిశీలించిన సబ్ కలెక్టర్..
X

దిశ, కాటారం : కాటారం మండల కేంద్రంలో గల తిమ్మన్న కుంట శివారు మొత్తాన్ని సర్వే చేసి ఆక్రమణల ప్రదేశంలో సరిహద్దులు ఏర్పాటు చేసేందుకు సోమవారం చేపట్టిన సర్వేను కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ పరిశీలించారు. తిమ్మన్నకుంట శివారు మొత్తం 5.26 గుంటలు భూమి ఉండాల్సింది ఉండగా కొంతమేరకు ఆక్రమణకు గురైంది. ఈ నేపథ్యంలో గత వారం గారి పెళ్లికి చెందిన జట్టుతో పాటు మరికొందరు రైతులు, యువకులు ఈ భూమిని ఆక్రమణల నుండి పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు విజ్ఞప్తి చేశారు.

సుమారు ఎకరం పైగా భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. హద్దు రాళ్లు వేసేందుకు సర్వే చేసేందుకు రెవెన్యూ, నీటిపారుదల ఇతర శాఖల అధికారులు ఆ స్థలానికి వెళ్లగా పలువురు వ్యక్తులు పురుగు మందు డబ్బాతో ఆత్మహత్య చేసుకుంటామని, సర్వే చేయరాదని అధికారులను హెచ్చరించారు. సబ్ కలెక్టర్ సర్వే అధికారులతో మాట్లాడారు. సర్వే ప్రకారం ప్రభుత్వ నిబంధనల మేరకు హద్దురాల్లను వేయాలని సూచించారు. సర్వేయర్ వినయ్, ఆర్ఐ వెంకన్న నీటిపారుదల శాఖ డీఈ సతీష్, వీఆర్ఎ శేఖర్ పలువురు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed