- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TRS MP Kavithaకు వ్యతిరేకంగా జాతీయ రహదారిపై రాస్తారోకో
దిశ, మహబూబాబాద్ టౌన్ : జిల్లాలోని బేతోల్ గ్రామంలో ఆదివారం ఉదయం జాతీయ రహదారిపై ప్రజలు రాస్తారోకోకు దిగారు. గ్రామంలోని ఇద్దరి మధ్య వివాదాన్ని ఆసరాగా తీసుకుని ఎంపీ కవిత ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపిస్తూ ఈ ఆందోళనకు చేపట్టారు. బాధితురాలు, ఎడబోయిన భుజంగరావు భార్య మాట్లాడుతూ పీ కవిత అనుచరుడైన సత్యనారాయణకు నా భర్త ఎడబోయిన భుజంగరావుకు మధ్య గొడవలు ఉన్నాయన్నారు. వాటిని సామరస్యకంగా పరిష్కరించమని కవిత వద్దకు వెళ్లగా ఎంపీ కవిత.. తన అరుచరుడైన సత్యనారాయణకు అనుకూలంగా మాట్లాడుతూ తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. కుటుంబ తగాదాలలో రాజకీయ నాయకుల ప్రమేయం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. పోలీసులు కూడా రాజకీయ నాయకుల అండదండలు ఉన్న వ్యక్తులకు మాత్రమే వత్తాసు పలుకుతూ తమల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. నా భర్త గత మూడు రోజులుగా కనిపించడం లేదని, వెంటనే అతడిని ఇంటికి పంపించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఈ నిరసనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Also More......
- Tags
- latest new
- trs