- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రజల పక్షాన మాట్లాడేవారే లేరు: అరుణోదయ విమలక్క
దిశ, హన్మకొండ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రజల తరపున మాట్లాడేవారే లేరని అరుణోదయ విమలక్క అన్నారు. హన్మకొండ హరిత హోటల్ లో తెలంగాణ బచావో - సదస్సులో ఆమె మాట్లాడారు. మలిదశ ఉద్యమంలో ఏవిధంగా ఉందో ఇప్పటికీ అదేవిధంగా ఉందన్నారు. విద్య, వైద్యం పేదలకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నుంచి ఉద్యమం మొదలు పెడుదామని, పోరాట ఉద్యమ కారులకు నిర్భందం జిల్లాకు కొత్తకాదని, ఎన్నో నిర్భంధాలను చవిచూసిన రాష్ట్రం తెలంగాణ అన్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని గుర్తుచేశారు. మద్యం మీద వచ్చిన ఆదాయంతో ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే ఇంతకన్నా దిగజారుడు దౌర్భాగ్యం మరొకటి లేదన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సంపద ప్రజలకు దక్కాలి అనుకున్నామని, కోట్లాది ఆస్తులు ఉన్న జానెడు జాగా కోసం ప్రజలు హరి గోస పడుతున్నారని చెప్పారు. ప్రజలకు పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఐదు సంవత్సరాలు పాలించి దోచేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు.