కుటుంబ సర్వే ను బహిష్కరించిన గ్రామం ఎందుకంటే…?

by Kalyani |
కుటుంబ సర్వే ను బహిష్కరించిన గ్రామం ఎందుకంటే…?
X

దిశ,కన్నాయిగూడెం :- తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక,ఆర్థిక,రాజకీయ,విద్య పై జరుపుతున్న కుటుంబ సర్వేను ఐలాపూర్ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కుటుంబ సర్వే నీ బహిష్కరించారు. అనంతరం మల్లెల లక్ష్మయ్య మాజీ సర్పంచ్ మాట్లాడుతూ… “దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా.. మా గ్రామానికి ఎలాంటి తారు రోడ్డు నిర్మించకపోవాటం, గతంలో పాలించిన ప్రభుత్వాలు ఇప్పుడు పాలిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం సిగ్గుచేటు” అని మండిపడ్డారు. “గిరివికాస పథకం ద్వారా బోర్లు వేసి 7 సంవత్సరాలు గడుస్తున్నా ఆ బోర్లాకు త్రీ ప్లస్ కరెంట్ కరువైంది. కాబట్టి మా గ్రామానికి సరైన మౌలిక సౌకర్యాలు కలిపించే వరకు ప్రభుత్వం చేపట్టిన కులగణన కుటుంబ సర్వేని నిర్వహించకూడదని ప్రభుత్వాన్నిహెచ్చరిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కోడె, సుధాకర్, చంద్రయ్య, మల్లేష్, బాలయ్యా ,వెంకటయ్యా, సరస్వాతి, పార్వతి, పాపక్కా, సమ్మక్కా, సావిత్రి, యూత్ నాగేష్, లక్ష్మినారాయణ, సధానందం, ఆదినారాయణ, ప్రభాకర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story