- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధ్వానంగా ఐకేపీ గోడౌన్..!
దిశ, మంగపేట : మండలంలోని తిమ్మంపేట రైతుల కోసం ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ఆధ్వర్యంలోని ధాన్యం నిల్వ చేసే గోడౌన్ పశువుల పేడ, దుమ్ము, ధూళితో అధ్వాన్నంగా ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు పండించిన ధాన్యం ఆరబోసుకొని కాంటాలు వేసిన తర్వాత అకాల వర్షాలు వచ్చే పరిస్థితులుంటే గోడౌన్ లో నిల్వ చేస్తుంటారు. అయితే గోడౌన్ పారిశుద్ధ్య లోపంతో అధ్వాన్నంగా తయారైంది రైతులు వాపోతున్నారు.
వారం రోజుల క్రితం తిమ్మంపేటలో ఐకెపీ దాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినా అధికారులు గోడౌన్ లో పేరుకుపోయిన పారిశుద్ధ్యాన్ని తొలగించకుండా కొనుగోల్లు చేయడం ఏంటని నిలదీస్తున్నారు. గోడౌన్ లో పశువులు, మేకలు, గొర్రెలు, బర్రెలు పేడ వేయడంతో దుర్ఘంధం వెదజల్లుతుందని, పరిసరాల్లో ఉండలేని పరిస్థితి ఉందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిల్వచేసే గోడౌన్ లో రైతులు తమ ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా తయారు చేయాలని తిమ్మంపేట రైతులు కోరుకుంటున్నారు.