వరంగల్ పరిసర ప్రాంతాల్లో వృక్షాలు నేలమట్టం..

by Sumithra |
వరంగల్ పరిసర ప్రాంతాల్లో వృక్షాలు నేలమట్టం..
X

దిశ, ఖిలా వరంగల్ : వరంగల్ జిల్లాలోని కొన్ని మండలాల్లో గాలి బీభత్సంతో కూడిన వర్షం కురిసింది. క్షణాల్లోనే చాలా మట్టుకు వృక్షాలు నేలమట్టమయ్యాయి. కొన్నిచోట్ల వృక్షాలు కూలి ఇల్లులు కూడా కూలిపోయాయి. వరంగల్ నగరంలో ఉదయం నుండి ఎండ తీవ్రత విపరీతంగా ఉంది. సాయంత్రం వేళ ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొచ్చి గాలితో కూడిన వడగండ్ల వాన కురిసింది. గాలి బీభత్సానికి చాలా చోట్ల వృక్షాలు నేలమట్టమయ్యాయి కొన్నిచోట్ల ఆస్తి నష్టం కూడా జరిగింది. ఖిలావరంగల్ లోని మధ్యకోటలో వేప చెట్టు కూలి నివాసగృహం కూలిపోయింది.

అకాల వర్షాలు రైతుల కష్టాలు..

వేసవి కాలం రైతులకు పంట చేతికొచ్చే సమయం, ఈ సమయంలో ఎక్కువగా వరి ధాన్యం, మొక్కజొన్న కోత కోసి సరుకును మార్కెట్ కు తరలించే సమయం అవ్వడంతో రైతులందరూ పంటలు కోసి ధాన్యాన్ని ఆరబెట్టారు. ఈ సమయంలో అకస్మాత్తుగా వర్షం కురిసి రైతులకు అపారనష్టాన్ని మిగిల్చింది.

Advertisement

Next Story

Most Viewed