మావోయిస్టు దంపతుల లొంగుబాటు

by Mahesh |   ( Updated:2023-04-27 08:40:45.0  )
మావోయిస్టు దంపతుల లొంగుబాటు
X

దిశ, హన్మకొండ: నిషేదిత మావోయిస్టు పార్టీకి చెందిన మావోయిస్టు దంపతులు బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా సి.పి మీడియాతో మాట్లాడుతూ కాసరనేని రవికుమార్ అలియాస్ అజిత్, అలియాస్ మున్నా, అలియాస్ సూర్య కంభంపాడు గ్రామం, మాచర్ల మండలం, పల్నాడు జిల్లా (పూర్వ గుంటూరు జిల్లా). ఆంధ్రప్రదేశ్. భద్రాద్రి కొత్తగూడెం- అల్లూరి సీతారామరాజు డివిజనల్ కమిటీ మెంబర్ మరియు మణుగూరు ఎల్.ఓ.ఎస్. కమాండర్ .మడివి సోమిడి అలియాస్ కల్పన, గుత్తికోయలు, బత్తిని పల్లి గ్రామం, చర్ల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పాల్వంచ ఏరియా కమిటీ మెంబర్ మరియు మణుగూరు ఎల్.ఓ.ఎస్ పనిచేస్తున్నారు.

డిప్యూటీ కమాండర్..

కాసరనేని రవికుమార్ స్వగ్రామంలో పదవ తరగతి వరకు చదువుకున్నదు ఇంటర్ మొదటి సంవత్సరంలో చదువును మధ్యలోనే ఆపేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తమ బంధువుల ఇంట్లో కొద్ది సంవత్సరాలు నివాసం వున్నాడు. ఇదే సమయంలో విప్లవ భావాలు కలిగి వున్న రవికుమార్ 2012 సంవత్సరంలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రెడ్ యూనియన్‌లో కొనసాగాడు.

కొద్ది రోజులకు కొత్తగూడెం కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఎంపికై ఆ తర్వాత పిడిఎస్‌యూలో చేరాడు. పిడిఎస్‌యూలో రవికుమార్ చురకుగా పనిచేయడంతో అతనిని కొత్తగూడెం పట్టణ విభాగం పిడిఎస్‌యూ అధ్యక్షుడు మరియు ఖమ్మం జిల్లా సభ్యుడిగా నియమించబడ్డాడు. ఈ సమయంలో రవికుమార్ పలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు.

2016 సంవత్సరంలో మావోయిస్టుల సిద్ధాంతాలకు అకర్షితుడై తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరి భూషణ్ ప్రోత్సహంతో మావోయిస్టు పార్టీ సభ్యుడిగా చేరి చర్ల ఏరియా కమాండర్ సోడి జోగయ్య నాయకత్వంలో పని చేసాడు. 2017 సంవత్సరంలో డిప్యూటీ కమాండర్ గా పనిచేసి 2019 సంవత్సరంలో మావోయిస్టు పార్టీ మణుగూరు ఎల్.ఓ.ఎస్ ఏసియం అయిన మడవి సోమిడి అలియాస్ కల్పనను వివాహం చేసుకున్నాడు. 2021 నుంచి భద్రాద్రి కొత్తగూడెం- అల్లూరి సీతారామరాజు డివిజన్లలో మణుగూర్, పాల్వంచ, ఏరియా కమిటీ మెంబర్ మరియు మణుగూరు ఎల్.ఓ.ఎస్ కమాండర్గాను, 2022 లో కో ఆప్షన్ డివిజనల్ కమిటీ మెంబర్‌గా పనిచేసాడు.

మావోయిస్టు పార్టీలో పనిచేసిన సమయంలో రవికుమార్ మావోయిస్టు పార్టీ నాయకులు, దళ సభ్యులతో కలిసి ఛత్తీస్ఘడ్, ఖమ్మం సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పులు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, పోలీసు స్టేషన్లు, పోలీస్ పికెట్లు, పోలీసులు ప్రజా ప్రతినిధులు, సాధారణ ప్రజలపై దాడులకు పాల్పడిన సంఘటనల్లో నిందితుడు. ఇతనిపై ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది.

మడివి సామిడి అలియాస్ కల్పన ప్రస్థానం...

మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు, ప్రసంగాలు, పాటలకు ఆకర్షితురాలైన కల్పన 2017 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరింది. 2018 సంవత్సరంలో చర్ల ఎల్.ఓ.ఎస్ సభ్యురాలిగా, 200 సంవత్సరంలో ఏసియం, మణుగూరు ఎల్.ఓ.ఎస్ డిప్యూటీ కమాండర్‌గా పని చేసింది. 2021 సంవత్సరంలో సుక్మా జిల్లా, జీరమతీ గ్రామంలో పోలీసు బలగాల పై దాడికి పాల్పడిన సంఘటనలో నిందితురాలు, ఇమేపై రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది.

ప్రస్తుత రోజుల్లో మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోవడంతో పాటు, పార్టీపై ప్రజల నమ్మకం సన్నగిల్లడం. పార్టీకి చెందిన కీలక నాయకులు పార్టీని వీడి లొంగిపోవడం, అరెస్ట్ కావడం, తమకు ఆరోగ్య సమస్యలు రావడం, లొంగిపోయి ప్రభుత్వం అందించే పథకాలను వినియోగించుకోని ప్రజలతో కలిసి స్వేచ్చగా జీవితం గడపాలనే అలోచనతో మావోయిస్టు దంపతులు లొంగిపోయినట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed