తిరగబడ్డ పోరుగడ్డ..పరకాల రక్త చరిత్ర..

by Aamani |
తిరగబడ్డ పోరుగడ్డ..పరకాల రక్త చరిత్ర..
X

దిశ, పరకాల : విమోచన ఉద్యమం వీరుల త్యాగఫలం.. ఎగిసింది పరకాల అమరధామం..స్వేచ్ఛ స్వాతంత్రం కోరుతూ బానిస బతుకుల నుంచి విముక్తి కోసం తిరగబడ్డ పోరుగడ్డ, రజాకార్ల గుండెల్లో ఫిరంగులై పెలిన, యోధులకు పురుడు పోసిన పుణ్యభూమి ఓరుగల్లు. తాడిత పీడిత జనం కోసం జరిగిన సమరంలో రజాకారులు మరుభూమిగా మార్చిన మరో జలియన్ వాలాభాగ్ పరకాల రక్త చరిత్ర.

నిజాం చీకటి రాజ్యానికి సజీవ సాక్ష్యం ఈ పరకాల గడ్డ..

సెప్టెంబర్ 17: తెలంగాణ ప్రజల జీవితాల్లో ఆనందాన్ని స్వేచ్ఛ వాయువులు నింపిన రోజు భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించింది. నిజాంలు ఏలుబడిలో ఉన్న తెలంగాణ 13 నెలల తర్వాత సెప్టెంబర్ 17, 1948 న స్వాతంత్రం పొందింది, ఈ స్వేచ్ఛ స్వతంత్రం కోసం వందలాది మంది తెలంగాణ పోరాట యోధులు అసువులు బాశారు. నాటి రజాకార్ల దాస్టికాలకు ప్రత్యక్ష సాక్ష్యం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని అమరధామం. రజాకారుల నరవేదానికి సాక్షిగా పరకాలలో రక్తపుటేరులు పారాయి. ఆ ఘటన మరో జలియన్ బాగ్ గుర్తుతెస్తుంది. 1947 సెప్టెంబర్ 2న పరకాల పట్టణం రణరంగంగా మారింది. హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం పాలన నుంచి విముక్తి చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ జెండా పట్టుకుని పరకాలలో ర్యాలీ నిర్వహిస్తున్న ఉద్యమకారులపై అప్పటి నిజాం రాకాసి మూకలు తుపాకి గుల్ల వర్షం కురిపించాయి. పరకాలలోని చాపల బండ నుంచి ఊరేగింపుగా బయలుదేరి ఉద్యమకారులు హిందుస్థాన్ జిందాబాద్, వందేమాతరం అంటూ నినాదాలు చేసుకుంటూ ఉప్పెనల బయలుదేరారు.

ఈ క్రమంలో అప్పటి పరకాల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జియావుల్, మెజిస్ట్రేట్ విష్ణువేశ్వర్ రావు, మూడు లారీల పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో ఉద్యమకారులపై తుపాకి పుల్ల వర్షం కురిపించారు. నాటి ఘటనలు 21 మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఒకవైపు పోలీసులు మరోవైపు రజాకార్ల తుపాకులు, బరిసెలు జనం మీద విరుచుకు పడ్డాయి. ఈ సంఘటనలో 21 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. వందల మంది గాయపడ్డారు. ఆనాటి నెత్తుటి సాక్షానికి నిలువెత్తు నిదర్శనం పరకాల లోని ప్రస్తుతం కనిపిస్తున్న ఈ అమరధామం.

బాంచన్ నీ కాల్మొక్త .. అంటూ బతికిన బడుగు జీవులే నిప్పు కణికలై, విప్లవ శంఖం పూరించిన మహత్తర పోరాట చరిత్ర తెలంగాణ సాయుధ పోరాటానిది. సామాన్యులను కూడా సాయుధులను చేసిన ఉద్యమం ఇది. ఈ చారిత్రక వారసత్వాన్ని కాపాడేందుకు అప్పటి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సీహెచ్ విద్యాసాగర్ రావు సెప్టెంబర్ 17 2003న చాపల బండ సమీపంలో రజాకారుల చేతిలో బలైన అమరుల త్యాగాల గుర్తుగా అమరధామం నిర్మాణానికి పూనుకున్నారు. 270 రోజులలోరూ. 50 లక్షలతో ఈ స్మృతి చిహ్నాన్ని పూర్తి చేశారు.

అమరధామం మెయింటెనెన్స్ చూస్తున్న పరకాల మున్సిపాలిటీ నాటి ఘటనకు సజీవ సాక్షాలు ఈ అమరధామ శిల్పాలు. ప్రస్తుతం దీని నిర్వహణ బాధ్యత పరకాల మున్సిపాలిటీ చూస్తోంది. స్వతంత్ర ఉద్యమాన్ని కల్లారా చూసినవారు, నాటి అకృత్యాల గురించి ఆనాటి పెద్దల నుంచి విన్నవారు, ఇప్పటికీ చెమ్మగిల్లి కళ్ళతో ఆనాటి చేదు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed