- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హామీలు అమలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్..: కొమ్మూరి ప్రతాపరెడ్డి
దిశ, బచ్చన్నపేట : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కొమ్మూరి ప్రతాపరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎలక్షన్ లో ఇచ్చిన హామీలను అమలుపరిచిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ నే అని పేర్కొన్నారు. రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో వడ్లు విక్రయించు కోవాలని సన్న వడ్లలకురే. 500 బోనస్ చెల్లిస్తామని పేర్కొన్నారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దనితెలియజేశారు.రైతులకు వ్యవసాయ పనిముట్లు మీద ఉన్న అన్ని సబ్సిడీలను ఎత్తేసిన ఘన చరిత్ర బీఆర్ఎస్ అని ఎద్దేవా చేశారు.
పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని ఇవ్వకపోవడం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఎగనామం పెట్టడం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెల్లుతుందని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాల తీసుకువచ్చిన జాతీయ పార్టీకి సహకరించిన కెసీఆర్ కి చెల్లుతుందని అన్నారు.కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగు చేస్తూ ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభించామని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్వేత, పీఏసీ చైర్మన్ పూర్ణచందర్, ఏపీఎం నాగేశ్వరరావు, కాంగ్రెస్ టౌన్ పార్టీ అధ్యక్షుడు మహాత్మా చారి జిల్లా నాయకులు జంగిటి విద్యనాథ్, గాలి కృష్ణ,ఇజ్జగిరి రాములు, చల్ల రమేష్ రెడ్డి, గుర్రం బాలరాజు, ఆముదాల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.