- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంక్షేమంలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ : ఎమ్మెల్యే గండ్ర
దిశ, రేగొండ : సంక్షేమంలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ మారిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని జూబ్లీనగర్, రంగయ్యపల్లి, పోచంపల్లి, రేపాక, రేపాకపల్లి, నాగుర్లపల్లి, కనీపర్తి, రాయపల్లె, దమ్మన్నపేట, రూపిరెడ్డి పల్లి గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, నూతన గ్రామ పంచాయతీ లను ప్రారంభించారు. ఆడపడుచులకు బతుకమ్మ చీరలు, యువతకు క్రీడా సామాగ్రి పంపించేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ భూపాలపల్లిలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానన్నారు. ప్రతి పల్లెకు అంతర్గత రోడ్లు సిసి రోడ్లు మంజూరు చేశానని తెలిపారు. అన్ని కులాలకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో ఆరు నుండి పదవ తరగతి చదివే విద్యార్థుల కోసం అల్పాహార పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు తమ లక్ష్యాలను గుర్తించే విధంగా అవగాహన కల్పించే విధంగా తయారు చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. గ్రామంలోని పెద్దలు యువత క్రీడల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులకు ప్రతిఏటా దసరా పండుగకు చీరలు పంపించేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మిరవి, జెడ్పిటిసి సాయిని విజయ, రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ మహేందర్ సర్పంచులు నారాయణ రెడ్డి, శ్రీనివాస రావు, రమణరెడ్డి, బండారి కవిత దేవేందర్, దగ్గు సంధ్య వెంకన్న, నరేష్, తిరుపతి, ఓదెలు, సుధాకర్ ఎంపిటిసిలు ప్రతాప్ రెడ్డి, శ్రీధర్, వెంకన్న, సుష్మా స్వరాజ్ నాయకులు తోట మల్లిక్, చంద్రారెడ్డి, నిమ్మల రాజు, ప్రశాంత్ రావు, రజినికాంత్ పాల్గొన్నారు.