ములుగు జిల్లా పేరు మార్చాలి.. తీన్మార్ మల్లన్న డిమాండ్

by Disha News Web Desk |
ములుగు జిల్లా పేరు మార్చాలి.. తీన్మార్ మల్లన్న డిమాండ్
X

దిశ, ములుగు: ములుగు జిల్లాకు సమ్మక్క-సారక్క నామకరణం చేయాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. ఇతర జిల్లాలకు దేవతల పేర్లు పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ములుగు జిల్లాకు ఎందుకు సమ్మక్క-సారక్కల పేరు పెట్టడం లేదని ప్రశ్నించారు. శనివారం ములుగు జిల్లాలో పర్యటించిన తీన్మార్ మల్లన్న, ములుగు జిల్లా పేరు మార్చి వనదేవతల పేరు పెట్టాలని కరపత్రం విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో మేడారం జాతరకు వచ్చి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సమ్మక్క-సారక్క దేవతల పేరుమీద ములుగు జిల్లా చేస్తానని ప్రకటించినట్లు గుర్తుచేశారు. గద్వాల్‌కు జోగులాంబ, సిరిసిల్లకు కేటీఆర్ నచ్చిన దేవుడు వేములవాడ రాజన్న అని, భువనగిరికి కేసీఆర్‌కు నచ్చిన దేవుడు యాదాద్రి అని, కొత్తగూడెంకు భద్రాద్రి అని ఈ విధంగా పెట్టి, ములుగు జిల్లాకు వనదేవతలైన సమ్మక్క-సారక్క నామకరణం ఎందుకు చేయాలని అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని ఈ జాతరలోనైనా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కరపత్ర ఆవిష్కరణలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, అధికార ప్రతినిధి వాసుదేవరెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి రాజు నాయక్, జిల్లా నాయకులు భూక్య జోహార్ నాయక్, చల్ల మహేందర్, తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు మొగుళ్ల భద్రయ్య, కో-కన్వీనర్ అచ్చునూరి కిషన్, లైవ్‌శెట్టి రవి రామన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed