- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సైబర్ నేరగాళ్లతో తస్మాత్ జాగ్రత్త : సీఐ రవికుమార్
దిశ ,బయ్యారం : కుటుంబ సర్వే పేరుతో కొంత మంది కొత్త తరహా దోపిడీ చేసే అవకాశం ఉందని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని గార్ల బయ్యారం సర్కిల్ ఇన్ స్పెక్టర్ రవికుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని ఆసరాగా చేసుకొని,సైబర్ కేటుగాళ్లు సైబర్ దోపిడీలకు పాల్పడవచ్చని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సర్వే పేరుతో ఇండ్లలోకి వస్తున్న అపరిచిత వ్యక్తులు బ్యాంకు అకౌంట్, బయోమెట్రిక్, ఫోన్ నెంబర్ ఓటీపీలు తీసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసు శాఖ దృష్టి కి వచ్చినట్లు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు మీ ఇంటికి వచ్చి సర్వే పేరుతో ఆధారాలు సేకరించే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని, సీఐ మండల ప్రజలను కోరారు. తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే జరుగుతున్న సంగతి తెలిసిందే. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. అసలైన సర్వే సిబ్బందికి సహకరించాలని కోరారు. అపరిచిత వ్యక్తులు వచ్చినట్లు అనుమానం వస్తే 100 ఫోన్ చేయాలని సూచించారు.