- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నకిలీ విత్తనాల పై నజర్..
దిశ, కాటారం : ఖరీఫ్ సీజన్ మరోపక్షం రోజుల్లో ప్రారంభం కానుంది. జూన్ మొదటి వారంలో తొలకరి పలకరించనుంది. ఈ నెలలో కురిసిన అకాల వర్షాలతో రైతులు తమ పంట చేనులను, పొలాల దుక్కులు దున్ని సిద్ధం చేస్తున్నారు. వానాకాలం పంటలు సాగు అంచనా మేరకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సమకూర్చుకునేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతులు అధికంగా పండించే పత్తి, వరి, మిర్చి విత్తనాలు ఏమైనా కంపెనీల విత్తనాల కోసం రైతులు వెంపర్లాడుతున్నారు. అధిక దిగుబడినిచ్చే పత్తి విత్తన కంపెనీల ధరలు కొన్ని బ్లాక్ మార్కెటు జరుగుతున్నట్టు రైతులు వాపోయారు. జిల్లాలో కొన్ని కంపెనీల విత్తనాలు కొన్ని దుకాణాలకు మాత్రమే స్టాక్ వచ్చింది. పూర్తిస్థాయిలో పత్తి, వరి విత్తనాలు దుకాణాలలోకి అందుబాటులోకి రాలేదు.
మారుమూల ప్రాంతాలలో రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని పట్టణాలకు చెందిన రైతులు మూల విత్తనాలను తీసుకొచ్చి రైతులకు కేజీలలో చొప్పున గ్రామాలలో విక్రయించే అవకాశం ఉంది. మరో వారం రోజులలో ఎరువులు, విత్తనాల విక్రయాలు ఊపందుకొనున్నాయి. మార్కెట్ ను నకిలీ విత్తనాలు ముంచెత్తే ఆకాశం ఉంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని విత్తనాలు,ఎరువుల అమ్మకాల నిఘా ఏర్పాటు చేసేందుకు జిల్లా వ్యవసాయ, పోలీస్ శాఖ అధికారులు కార్యాచరణ రూపొందించారు. జిల్లా మండల స్థాయిలో వ్యవసాయ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన సమాచారంతో విజిలెన్స్ శాఖ దాడులు నిర్వహించే అవకాశం ఉంది. తరచుగా జరిపే వ్యవసాయ పోలీస్ శాఖ తనిఖీలు మండల కేంద్రాలకు కాకుండా గ్రామాలు విక్రయించే దుకానాలలో తనిఖీలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతులు వాపోతున్నారు.
రైతులకు దిగుబడి ఇవ్వని విత్తనాలతో పరేషాన్..
జిల్లాలో పత్త, వరి ఇతర విత్తనాలు రైతులను పరేషాన్ చేస్తున్నాయి. ఏదో కంపెనీతో విత్తనాలు విక్రయిస్తున్నప్పటికీ నాణ్యమైన వా ?.. నకిలీవా ? తెలియని పరిస్థితి రైతులకు పరేషాన్ అవుతుంది. విత్తనాలు మొలకెత్తి పూత కాసేదాకా, వరి పంటలో ఏపుగా పెరిగి కొంతమేరకు వరి కంకులు వేయడం మరికొంత అలాగే ఉండడంతో నకిలీ విత్తనం తెలియకపోతుండడం పంట చేతికొచ్చే సమయంలో పూత ఖాతా రాక రైతులు నట్టేట మునుగుతున్నారు. ప్రతి ఏటా జిల్లాలో ఏదో ఒకచోట మొలకెత్తకపోవడం పత్తి మొలకెత్తిన పూత రాకపోవడం వరి పంటలో కలుతులతో దిగుబడు రాకపోవడం సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
ప్రైవేట్ సీడ్ కంపెనీలే రైతులకు దిక్కు..
గతంలో ప్రభుత్వం వరి, అపరాల విత్తనాలను సబ్సిడీతో రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా సరఫరా చేసేది. వ్యవసాయ పనిముట్లను, పత్తిపంట పై సస్యరక్షణ చర్యలు చేసేందుకు పవర్స్ ప్రేయర్లు, హ్యాండ్ స్ప్రేయర్లను సబ్సిడీ పై రైతులకు సరఫరా చేసేది. నేలుగా ప్రభుత్వం ఈ పద్ధతినికి స్వస్తి పలికింది. రైతులు ఎక్కువగా సాగుచేసే వరి, పత్తి పంటలకు ప్రైవేటు కంపెనీలు ఉత్పత్తి చేసే విత్తనాలను అధిక ధరలకు వెచ్చించాల్సి వినియోగిస్తున్నారు. ఈ ఏడాది పత్తి ప్యాకెట్ కు 50 రూపాయలు అదనంగా కంపెనీలు పెంచాయి. పత్తి 475 గ్రాముల పాకెట్ ఎమ్మార్పీ ధర 853 గా ఉంది. విత్తనాభివృద్ధి సంస్థ ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్లో విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండడం లేదని రైతులు వాపోయారు.
వ్యవసాయ శాఖఖరీఫ్ ప్రణాళిక సిద్ధం..
జిల్లాలోని 11 మండలాల్లో ఖరీఫ్ సీజన్లో తమ ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. వరి పంట 1,05,600 ఎకరాలు, పత్తి పంట 1,02,600 ఎకరాలు, మిర్చి పంట 22,360 ఎకరాలు, ఆయిల్ ఫామ్ 4,250 ఎకరాలు, మొక్కజొన్న, పసుపు, జొన్న, పల్లికాయ, పెసర , మినుములు, కందులు ఇతర అన్ని పంటలు కలిపి సుమారు 9 వేల ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగు చేస్తారు. ప్రధాన పంటలు సాగు చేసేందుకు వరి పంటకు 26,400 క్వింటాళ్లు, పత్తికి 923.4 క్వింటాళ్లు, వేరుశనగకు 172 క్వింటాళ్లు విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఖరీఫ్ సీజన్లో పంటలు సాగు చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళిక ప్రకారం, యూరియా 29,297 మెట్రిక్ టన్నులు, డీఏపి 8545 మెట్రిక్ టన్నులు, ఎంఓపి 61 03 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 8545 మెట్రిక్ టన్ల, ఎస్ఎస్పి 244 మెట్రిక్ టన్నులుఎరువులు అవసరమవుతాయి.
కల్తీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు.. విజయ భాస్కర్, జిల్లా వ్యవసాయ అధికారి
వానాకాలం సీజన్ ప్రారంభంలో రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతాం. సంబంధిత ధ్రువపత్రాలు లేకుండా విత్తనాలు ఎరువులు విక్రయం చేయొద్దు. ఎరువుల విత్తనాల దుకాణాల ద్వారా సరుకులు విక్రయిస్తే రైతులకు తప్పకుండా రసీదులు ఇవ్వాలి. రైతులు విత్తనాలు ఖరీదు చేసినప్పుడు తప్పకుండా రసీదులు తీసుకొని వంట పూర్తయ్య వరకు భద్రపరుచుకోవాలి. విత్తనాల నుండి రైతుల ద్వారా తీసుకొని దిగుబడులు రాకుండా వ్యవసాయ శాఖ బాధ్యత వహించదు. నకిలీ విత్తనాలను దుకాణదారులు ప్రైవేట్ వ్యక్తులు ఎవరు విక్రయించిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. నకిలీ విత్తనాల అమ్మకాల పై జిల్లా మండల స్థాయిలో ట్రాఫిక్ కవర్స్ కమిటీలు పనిచేస్తాయి. నకిలీ విత్తనాలు విక్రయాలు జరుగుతున్నట్లు ఎవరికీ తెలిసిన వ్యవసాయ శాఖ పోలీస్ శాఖలకు సమాచారం ఇస్తే సరైన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఇప్పటికే దుకాణాలలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాము. ఎవరైనా కృత్రిమంగా ఎరువులు విత్తనాల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోబడును.