- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీబీఎస్ఈ ఫలితాలలో సత్తాచాటిన ఏకశిల విద్యాసంస్థల స్టూడెంట్స్
దిశ, హనుమకొండ టౌన్: సీబీఎస్ఈ ఫలితాలలో ఏకశిల విద్యా సంస్థలు విజయ దుందుభి మోగించాయి. శుక్రవారం ప్రకటించిన సీబీఎస్ఈ -2023 ఫలితాలలో ఏకశిల విద్యార్థులు 485, 484, 483, 481 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ఏకశిల విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ గౌరు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. ఉన్నతమైన ఆలోచన, నిరంతర శ్రమ, నిర్దిష్టమైన ప్రణాళికతో, అత్యుత్తమైన బోధనతో, క్రమశిక్షణతో కూడిన విద్యా విధానం మా ఈ విజయాలకు కారణమయ్యాయి అని తెలిపారు. ఉపాధ్యాయులు బోధనలో అనుసరించే మార్గాలు మారుతున్న సమాజానికి అనుగుణంగా ఉండాలని బోధనతోపాటు సృజనాత్మకతను జోడించి తరగతి గదిలో ఉన్న విద్యార్థులందరినీ భాగస్వామ్యం చేయడం ద్వారానే మా విద్యార్థులు విజయతీరాలకు చేరుతున్నారని పేర్కొన్నారు.
మా విద్యాసంస్థల్లో విద్యను ఆర్థిస్తున్న విద్యార్థుల ప్రజ్ఞ్యను వెలికి తీసి అత్యంత ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో మేము ముందు వరుసలో ఉంటామని.. ఈ విద్యా ఫలాలు ప్రతి విద్యార్థి ఉపయోగించుకొని ప్రయోజకులుగా మారాలని సూచించారు. ఈరోజు ఇంతటి ఘన విజయానికి కారణమైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులను తల్లిదండ్రులను అభినందించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల వివరాలు, కె. సాయి దీక్షిత్ 485 మార్కులు ( 20260535), ఏ. హర్షిత్ 484 మార్కులు (20261292), ఎం. ఫణికీర్తన్ రెడ్డి 483 మార్కులు (20260542), కే. హారిక 481 మార్కులు (20261247) సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏకశిలా విద్యాసంస్థల డైరెక్టర్లు బేతి కొండల్ రెడ్డి, గౌరు సువిజా రెడ్డి, ప్రిన్సిపల్స్ ఎండీ బాబా, కే రవికిరణ్, కె రమేష్ రెడ్డి, సీహెచ్ దినేష్ రెడ్డి, బి లక్ష్మణ్, కే బిక్షపతి, జి ఫణి మోహన్ రావు, లవ కుమార్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.