- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA : రాష్ట్ర ప్రభుత్వ హయాంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత
దిశ, హనుమకొండ టౌన్: కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహిస్తున్న 2024 - 25 విద్యా సంవత్సరం అంతర్ కళాశాలల పురుషుల క్రీడా పోటీల లో గెలుపొందిన క్రీడాకారులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదివారం రోజు బహుమతులు, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో మంచి క్రీడాకారులను తయారు చేయుటకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఇందుకు కావలసిన ప్రణాళికలు ప్రణాళికలు తయారు చేసి తమకు పంపిస్తే కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి తో మాట్లాడి క్రీడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా తగు చర్యలు చేపడతానని అన్నారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ ప్రొ. జ్యోతి మాట్లాడుతూ.. కళాశాలలో విద్యతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించుటకు అంతర్ కళాశాలల క్రీడలను నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కేయూ స్పోర్ట్స్ బోర్డు సంచాలకులు ప్రొఫెసర్ వెంకయ్య, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. రమేష్, శ్రీనివాస్, ఆర్ట్స్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ భాస్కర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డి, హెల్త్ సెంటర్ నిర్వాహకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాల్ బ్యాడ్మింటన్ లో మొదటి బహుమతి వాగ్దేవి కళాశాలకు, రెండవ బహుమతి సీకేఎం కళాశాలకు, కోకో విన్నర్స్ కేయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల, రన్నర్స్ కేడీసీ, సాఫ్ట్బాల్ విన్నర్స్ ఆర్ట్స్ కళాశాల, రన్నర్స్, వాగ్దేవి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలకు ట్రోఫీలను అందజేశారు.