- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య
by D.Reddy |

X
దిశ, గూడూరు: తండ్రి మందలించాడని కొడుకు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రహ్మణపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్రహ్మణపల్లి గ్రామానికి అయిలీ వెంకటేష్(19) డిగ్రీ చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం వెంకటేష్ ప్రవర్తన బాగోలేక ఆగ్రహంతో తండ్రి మందలించాడు. దీంతో ఇంట్లో నుండి పారిపోయాడు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆచూకీ కోసం గాలించగా, గురువారం గూడూరు మండల కేంద్ర శివారు చంద్రుగూడెం పల్లె ప్రకృతి వనంలో మృతదేహం కనిపించింది. తండ్రి మందలించడంతోనే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకొని ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story