- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సీతక్క..
దిశ, ములుగు ప్రతినిధి : శనివారం ములుగు జిల్లా కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఉద్యోగుల సంఘం తరఫున ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ సీతక్కకి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులుగా ప్రకటించిన సందర్భంగా ఉద్యోగులు పరస్పరం సీట్లు పంపిణీ చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ములుగు లాంటి ఏజెన్సీ జిల్లా నుంచి రాష్ట్ర మంత్రిగా పేదల పక్షపాతి అయిన దనసరి అనసూయ సీతక్కను గ్రామఅభివృద్ధి శాఖ మంత్రిగా ఎదిగినందుకు అదే శాఖలో పని చేస్తున్నటువంటి ములుగు జిల్లా ఉపాధి హామీ ఉద్యోగులు సంబరాన్ని జరుపుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా జాక్ చైర్మన్ మాలోతు రాజు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో గత 20 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఏపీవోలు, డీఆర్డీఏ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది, కమిషనర్ ఆఫీసులో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది అందరూ పన్నెండు వేల మంది ఉద్యోగులు సీతక్క నాయకత్వంలో ఉద్యోగాల విషయంలో మేనిఫెస్టో పెట్టిన విధంగా ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తారని నమ్మకం వ్యక్తపరిచారు. ఉపాధి హామీ పథకాన్ని సీతక్క ఆధ్వర్యంలో ఇంకా ప్రజలకు ఎక్కువ సేవలు చేస్తామని ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ తరఫున జాక్ చైర్మన్ మాలోత్ రాజు, టెక్నికల్ అసిస్టెంట్ల సంఘం నుండి సురేష్, రామయ్య, కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం నుండి సర్దార్ శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ ల సంఘం నుండి సురేష్, రఘు, భాస్కర్, సమ్మయ్య, మహిళా ఉద్యోగులు కవిత, మంజుల, కళ్యాణి తదితర ఉద్యోగుల సంఘం బాద్యులు పాల్గొన్నారు.