- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూరియా కొరత.. దుకాణాల చుట్టూ రైతుల ప్రదక్షిణలు
దిశ, కాటారం : మార్కెట్లో రైతుల నుండి యూరియా కు డిమాండ్ పెరగడంతో కొరత ఏర్పడింది. భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ పరిధిలో యూరియా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ దుకాణాలు, ప్రభుత్వరంగ సంస్థలు, డిసిఎంఎస్, ఆగ్రోస్, సొసైటీ ల దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. యూరియాను ఉత్పత్తి చేస్తున్న కంపెనీల నుండి రైలు బోగిల ద్వారా జిల్లాలకు లేదా రేక్ పాయింట్ లకు వస్తున్న యూరియా కోటాలో 80% యూరియా అలాట్మెంట్ ను వ్యవసాయ శాఖ పరిధిలోకి తీసుకొని ప్రభుత్వ రంగ సంస్థ లకు మార్క్ ఫెడ్ ద్వారా అలాట్మెంట్ ఇస్తోంది. మిగతా 20 శాతం మాత్రమే ప్రైవేటు దుకాణాల దారులకు ఆయా కంపెనీలు కేటాయిస్తున్నాయి. సింగిల్ విండో సొసైటీల దుకాణాలకు మాత్రమే ప్రభుత్వము యూరియాను డెలివరీ చేస్తోంది. డీసీఎంఎస్, అన్ని ఆగ్రో సంస్థలకు డెలివరీ ఇవ్వకపోవడంతో రవాణా చార్జీలు కలిపి యూరియాను 50 కిలోల బస్తా ఒక్కంటికి రూ.300కు పైగా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
ఇవాళ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పంటలను కోసం రైతులు ఎక్కువగా యూరియాను వినియోగిస్తున్నారు ఈ నేపథ్యంలో యూరియా కొరత ఏర్పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గురువారం పాతాళం మండల కేంద్రంలో ప్రైవేట్ దుకాణాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల దుకాణాలలోనూ యూరియా రైతులకు లభించలేదు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ మహాదేవపూర్ సబ్ డివిజన్లో యూరియా కొరత లేకుండా చూసి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.