- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ముగ్గురు మృతి
దిశ, ఏటూరునాగారం: జాతీయ రహదారి 163 పై ఆటోను, కంటైనర్ ఢీ కొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం నెలకొని అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..వాజేడు మండలలానికి చెందిన కాకర్ల పూడి సత్యనారాయణ (74), భార్య కాకర్లపూడి సత్యవతి(70) తో కలిసి కూతురు సాగరోజు అనిత(40)ను వైజాగ్ లోని తుని గ్రామానికి పంపించడం కోసం శనివారం రోజున సాయంత్రం వాజేడు నుండి ఏటూరునాగారం బస్టాండ్ కు టీఏస్.25 టీ 2438 అనే ఆటోలో వెళ్తున్నారు. ఏటూరునాగారం వైపు నుండి చత్తీస్ ఘడ్ వైపు వెలుతున్న కంటైనర్ జాతీయ రహదారి 163 పై ట్రీట్ హోటల్ సమీపంలోని ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో కాకర్ల పూడి సత్యనారయణ, భార్య సత్యవతి, ఆటో డ్రైవర్ తల్లడి నాగరాజు (30) అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే ఆటో ప్రయాణిస్తున్నసాగరజు అనిత, అంజి రెడ్డికి తీవ్ర గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం ఏటూరునాగారం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా విషయం తెలుసుకున్న ఏటూరునాగారం ఏఏస్పీ శివమ్ ఉపధ్యాయ, ఏటూరునాగారం ఏస్సై తాజోద్దిన్ హూటాహూటిన ఘటన స్థలానికి చేరుకోని ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఆటోను ఢీ కొట్టిన కంటైనర్ అపకుండా వేగంగా వెళ్లిపోయింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ఏటూరునాగారం ఏస్సై తాజోద్దిన్ అప్రమత్తమై వాజేడు, మంగపేట, తాడ్వాయి మండలాల పోలిసు అధికారులకు సమాచారం అందించి అప్రమత్తం చేశారు. దీంతో వాజేడు మండలం జగన్నాదపూరం క్రాస్ వద్ద వేగంగా వెలుతున్న కంటైనర్‌ను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. అయితే కంటైనర్ ఉన్న డ్రైవర్ మరోక వ్యక్తి పారిపోయినట్లు సమాచారం.