- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డిది ఐరన్ లెగ్ : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్
దిశ, జనగామ : రేవంత్ రెడ్డిది ఐరన్ లెగ్ అని, ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనమేనని, ఆయన మాటలు తుపాకి రాముడు మాటలు అంటూ టీపీసీసీ చీఫ్ పై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. శుక్రవారం జనగామ జిల్లా యశ్వంతపూర్ గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాదయాత్రను అగౌరవపరుస్తున్నాడని విమర్శించారు. పాదయాత్రలో నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. తెలంగాణ కోసం తాను జైలుకు కూడా వెళ్లానని, రేవంత్ రెడ్డి భూకబ్జాలు, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతూ కోట్లాది రూపాయలు సంపాదించాడని విమర్శించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగనని, ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ప్రజాక్షేత్రంలో గెలిచానని, అలాంటి తనను రేవంత్ రెడ్డి దూషించేస్థాయా? అంటూ విమర్శించారు.
చంద్రబాబుతో కొట్లాడి తాను తెలంగాణ ఇప్పించేందుకు పోరాటం చేస్తే, రేవంత్ రెడ్డి ఆయన ఏజెంట్గా పని చేశాడని విరుచుకుపడ్డాడు. రేవంత్ రెడ్డి జీవితమంతా బ్లాక్ మెయిలింగ్ అని ఆరోపించారు. జంగా రాఘవరెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కానీ తనపై పోటీ చేసి గెలవాలని, ఒకసారి కొడంగల్ లో ఓటమిపాలై పార్లమెంటుకు వెళ్లిన రేవంత్ రెడ్డి, పోటీ చేయడని అన్నారు. ఎందుకంటే గెలిచిన చోట ప్రజలకు ఏమి చేయడని తిరిగి అక్కడి నుండే పోటీ చేస్తే ప్రజలు గుణపాఠం చెబుతారని తెలిసి వేర్వేరు ప్రాంతాల నుంచి పోటీ చేస్తున్నాడని మంత్రి విమర్శించారు. జనగామ జిల్లాకు మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందించి ప్రజల కష్టాలు తీర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. జనగామ జిల్లాకు మెడికల్ కళాశాల, స్టేషన్గన్పూర్ లో డిగ్రీ కళాశాల మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రిదే అన్నారు. షర్మిల పిచ్చికూతలు కూయడం బంద్ చేయాలని సూచించారు. కాలేశ్వరం ద్వారా వరంగల్ జిల్లాకు నీరందిస్తున్నట్లు చెప్పారు.
ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు
అంతకు ముందు మంత్రి దయాకర్ రావు పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగల సంపత్ రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాడికొండ రాజయ్య తదితరులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున, గ్రంధాలయ చైర్మన్ ఎడవల్లి కృష్ణారెడ్డి, ఎర్రి రమణారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బండ పద్మ యాదగిరి రెడ్డి, రఘునాథపల్లి వారాల రమేష్ యాదవ్, జెడ్పీటీసీ నిమ్మతి దీపిక మహేందర్ రెడ్డి, పోకల శివకుమార్, నామాల బుచ్చయ్య, కౌన్సిలర్లు కర్రె శ్రీను, వాంకుడోత్ అనిత, దేవర నాగరాజు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ కన్వీనర్ డాక్టర్ సుల్తాన్ రాజా, జూకంటి శ్రీశైలం పాల్గొన్నారు.