ప్రకృతి ఒడిలో రాములోరి కళ్యాణం.. జనసంద్రమైన గుట్టమీది తీర్థం..

by Disha Web Desk 23 |
ప్రకృతి ఒడిలో రాములోరి కళ్యాణం.. జనసంద్రమైన గుట్టమీది తీర్థం..
X

దిశ,నెక్కొండ : వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామంలో కొండపై శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. గ్రామ సమీపంలోని ఓ కొండపై దశాబ్దాల క్రితం శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయ దేవతామూర్తుల విగ్రహాలు వెలసినట్లుగా అనేక రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి.ఈ కళ్యాణ వేడుకలకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది.సుదర్శన్ రెడ్డి హాజరై దేవతామూర్తులకు పట్టువస్త్రాలు సమర్పించి,ప్రత్యేక పూజలు నిర్వహించారు.




జనసంద్రమైన గుట్టమీది తీర్థం..

దాదాపు కిలోమీటరు పైగా ఎత్తులో ఉన్న గుట్టమీద ప్రకృతి ఒడిలో జరిగే కళ్యాణ మహోత్సవ వేడుకలకు కాలినడకన వేలాదిగా భక్తులు తరలివచ్చారు. నెక్కొండ,కేసముద్రం,పర్వతగిరి,నెల్లికుదురు,వరంగల్,హైదరాబాద్ లాంటి ప్రదేశాల నుండి ప్రతి సంవత్సరం వేడుకలకు భక్తులు హాజరవుతారు.


మండుటెండల్లో కొండపై తరగని జలసిరి..

మండుటెండను లెక్కచెయ్యకుండా కాలినడకన గుట్టమీదకు చేరుకున్న భక్తులకు పచ్చని ప్రకృతిమాత తన్మయత్వంలో ఓలలాడిస్తుంది.మండే ఎండలకు భూమిపై ఉండే బావుల్లో,చెరువుల్లో నీళ్ళ ఆనవాలు కనిపించడం కష్టంగా ఉండే రోజులు.అలాంటిది గుట్టపై ఉండే గుండంలో అంతరతామర పూలతో రమణీయంగా ఉన్న తరగని జలసిరి భక్తులను స్వాగతం పలుకుతుంది.భక్తులు గుండంలోకి వెళ్లి తప్పిక తీర్చుకొని,భక్తిభావంతో కోనేరు నీటిని ఇంటికి తీసుకవెళ్లి పంటపొలాల్లో,నివాస గృహాల్లో చల్లుకోవడం ఆనవాయితీగా మారింది.జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ చంద్రమోహన్,ఎస్సైలు మహేందర్,అరుణ్ కుమార్,సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.ఈ వేడుకలకు ఆలయ అభివృద్ధి ప్రధాతలు వద్దిరాజు.వెంకటేశ్వర్లు,ఎంపీపీ రమేష్ నాయక్,మాజీ సర్పంచ్ బానోత్ శ్రీధర్,ఎంపీటీసీ,ఆలయ కమిటీ నిర్వాహకులు,బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య,యాకూబ్,చందు,వినోద్,సైదులు,భక్తులు పాల్గొన్నారు.





Next Story