పది ఫలితాల్లో సెయింట్ ఆగ్నెస్ ప్రభంజనం

by Disha Web Desk 23 |
పది ఫలితాల్లో సెయింట్ ఆగ్నెస్ ప్రభంజనం
X

దిశ,డోర్నకల్ : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కేంద్రంలోని సెయింట్ ఆగ్నెస్ హై స్కూల్ నూరు శాతం ఫలితాలతో ప్రభంజనాన్ని సృష్టించింది.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ హెలెన్ రాణి మాట్లాడుతూ.. తమ పాఠశాల విద్యార్థులు పది ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణతతో సత్తా చాటారని తెలిపారు.బి.నిహారిక,ఏ.సాయి చరణ్ 10/10 లు సాధించినట్లు తెలిపారు.93 మంది విద్యార్థులు చక్కటి ఉత్తీర్ణతతో మెరిసినట్లు తెలిపారు.దీంతో ప్రిన్సిపల్ హెలెన్ రాణి,టీచర్ల,విద్యార్థులు స్వీట్లు పంచుకున్నారు.బాణాసంచాలతో పట్టణం మారుమోగింది.మరోసారి సెయింట్ ఆగ్నెస్ హై స్కూల్ విద్యార్థులకు ఎదురులేని ఫలితాలు వచ్చాయని ఏదైనా తమ పాఠశాల టాప్ అని కరస్పాండెంట్ ఆంటోనీ తెలిపారు.

Next Story

Most Viewed