ఆ భారత మాజీ క్రికెటర్‌ను కలిసిన బీసీసీఐ పెద్దలు.. హెడ్ కోచ్ పదవి ఆఫర్?

by Harish |
ఆ భారత మాజీ క్రికెటర్‌ను కలిసిన బీసీసీఐ పెద్దలు.. హెడ్ కోచ్ పదవి ఆఫర్?
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 వరల్డ్ కప్‌తో ముగియనుంది. ఆ పదవిలో కొనసాగేందుకు ద్రవిడ్ సుముఖంగా లేడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త హెడ్ కోచ్ కోసం వేట మొదలుపెట్టింది. ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించగా.. అప్లై చేసుకునేందుకు మే 27 చివరి తేదీ. అయితే, ద్రవిడ్ అనంతరం భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్ బాధ్యతలు చేపట్టనున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇటీవల గంభీర్‌ను బీసీసీఐ పెద్దలు కలిసినట్టు ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. గంభీర్‌కు హెడ్ కోచ్ పదవి ఆఫర్ చేసినట్టు పేర్కొంది. ఐపీఎల్ తర్వాత అతనితో మరోసారి చర్చలు జరపనున్నట్టు సదరు మీడియా సంస్థ తెలిపింది. అయితే, దీనిపై బీసీసీఐ అధికారికంగా స్పష్టతనివ్వాల్సి ఉంది. అయితే, గంభీర్‌ దేశవాళీ స్థాయిలో కోచ్‌గా పనిచేయలేదు. కానీ, ఐపీఎల్‌లో మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు, అంతకుముందు 2022తోపాటు గతేడాది లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా ఉన్నాడు. గత రెండు సీజన్లలో లక్నో ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా.. ఈ సీజన్‌లో కోల్‌కతా కూడా నాకౌట్‌ రౌండ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed