ఐపీఎల్ 2024: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో

by Disha Web Desk 12 |
ఐపీఎల్ 2024: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో భాగంగా ఈ రోజు లక్నో, ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై బ్యాటింగ్ చేయనుంది. పాయింట్ల పట్టికలో లక్నో 5, ముంబై 9వ స్థానంలో ఉన్నాయి. కాగా ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ రేసులో రెండో స్థానంలో నిలవాలని లక్నో చూస్తుంది. మరోవైపు వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై జట్టు ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలవాలని భావిస్తుంది. ఈ రోజు రోహిత్ శర్మ బర్త్ డే కావడంతో ముంబై అభిమానులు మంచి విజయం కోసం ఎదురు చూస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే మ్యాచ్ చివరి వరకు వేచి చూడాల్సిందే మరి.

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(w), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నెహాల్ వధేరా, టీమ్ డేవిడ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయట్ జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్ (w/c), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్

Next Story

Most Viewed