కేసీఆర్ తెలంగాణను పీక్కుతింటున్నాడు: సీఎంపై రాకేష్ రెడ్డి ఫైర్

by Satheesh |
కేసీఆర్ తెలంగాణను పీక్కుతింటున్నాడు: సీఎంపై రాకేష్ రెడ్డి ఫైర్
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: వీధికుక్కల‌ను నియంత్రించ‌లేద‌ని చాత‌గాని ద‌ద్దమ్మలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మునిసిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్‌ల‌ను ఉద్దేశించి బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి ధ్వజ‌మెత్తారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పీక్కుతింటుంటే.. రాష్ట్రంలోని పిల్లల‌ను కుక్కలు పీక్కుతింటున్నాయ‌ని మండిప‌డ్డారు. ప్రజ‌ల ప్రాణాలు పోతున్నా మునిసిప‌ల్ శాఖ అధికారుల‌కు, పాల‌కులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అన్నారు. వేసవి సెల‌వుల్లో పిల్లలను బ‌య‌ట‌కు తీసుకెళ్లాలంటే త‌ల్లిదండ్రులు భ‌య‌ప‌డే ప‌రిస్థితి నెల‌కొంద‌ని అన్నారు.

కాజీపేట‌లో వీధి కుక్కల దాడిలో ఉత్తర‌ప్రదేశ్ వ‌ల‌స కుటుంబానికి చెందిన చోటు అనే ఎనిమిదేళ్ల బాలుడి చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా రాకేష్ రెడ్డి ఓ వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. ఆ వీడియోలో జీడ‌బ్ల్యూఎంసీ, జీహెచ్ ఎంసీ మేయ‌ర్లతో పాటు మునిసిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ల‌పై నిప్పులు చెరిగారు. కాజీపేట ఘ‌ట‌న కుక్కలు చేసిన హ‌త్య కాద‌ని, పాల‌కులు చేసిన హ‌త్య అంటూ ధ్వ‌జ‌మెత్తారు.

జీడ‌బ్ల్యూఎంసీలో కుక్కలు చింపిన విస్తారిలా పరిపాల‌న కొన‌సాగుతోంద‌ని అన్నారు. అస‌మ‌ర్థుల‌ను మేయ‌ర్లుగా చేసి హైద‌రాబాద్‌, వ‌రంగ‌ల్ కార్పోరేష‌న్లలో పరిపాల‌న సాగిస్తున్నారంటూ విమ‌ర్శించారు. చాత‌గాని ద‌ద్దమ్మల పాల‌న‌లో రాష్ట్రంలో ప్రాణాల‌కు ర‌క్షణ లేకుండాపోయింద‌ని మండిప‌డ్డారు. పాల‌కుల వైఫ‌ల్యంతో జ‌రిగిన హ‌త్యల‌కు ప్రభుత్వంలోని పెద్దలు త‌ప్పకుండా ప్రజ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed