వాజేడు ఎస్సైగా బాధ్యత‌లు తీసుకున్న రాజ్‌కూమార్‌..

by Kalyani |
వాజేడు ఎస్సైగా బాధ్యత‌లు తీసుకున్న రాజ్‌కూమార్‌..
X

దిశ‌, ఏటూరునాగారంః -ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేష‌న్‌కు నూత‌న ఎస్సైగా ఏన్.రాజ్‌కూమార్ ను నియ‌మిస్తూ ఉన్న‌తాధికారులు అదేశాలు జారీ చేశారు. కాగా ప్ర‌స్తుతం వాజేడు పోలీస్ స్టేష‌న్ ఇన్చార్జ్ ఎస్సైగా విధులు నిర్వ‌హిస్తున్న గుర్రం కృష్ణ ప్ర‌సాద్ నుంచి నూత‌న ఎస్సైగా ఏన్.రాజ్‌కూమార్ శుక్ర‌వారం రోజున‌ వాజేడు నూత‌న ఎస్సైగా ప‌ద‌వీ బాధ్యతలు స్వీక‌రించారు. ఈ సంద‌ర్బంగా ఎస్సై రాజ్‌కూమ‌ర్ మాట్ల‌డుతూ..వాజేడు పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఏజెన్సీలో శాంతి భ‌ద్ర‌త‌లు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమ‌లు చేస్తాన‌ని, అసాంఘిక కార్య‌క‌ల‌పాల‌కు పాల్ప‌డిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed