- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్‌కు రాజయ్య షాక్..కాంగ్రెస్ కీలక నేతతో రహస్య భేటీ
దిశ,వరంగల్ బ్యూరో : కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సోమవారం భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత కొద్దిరోజులుగా రాజయ్యను కాంగ్రెస్‌లోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతుండగా, తాజాగా రాజయ్యే దామోదర రాజనర్సింహను కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. స్టేషన్‌ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యకు బదులుగా బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఇటీవల టికెట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రాజయ్య ఆయన అనుచరులు తీవ్ర మనస్తాపం చెందారు. ఈ క్రమంలోనే దాదాపు పది రోజులుగా సైలెంట్‌గా ఉన్న రాజయ్య నాలుగైదు రోజులుగా తాను జనంలోనే ఉంటానన్న వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ కూడా తనకు అత్యంత సన్నిహితుల వద్ద వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రాజయ్యకు టికెట్ దక్కకుండా చేయడంలో కడియం కుట్రలున్నాయంటూ వ్యాఖ్యనించారు. మందకృష్ణ వ్యాఖ్యల తర్వాత నియోజకవర్గంలో వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో వరుసగా రాజయ్యకే బీఆర్ ఎస్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కూడా కొనసాగిస్తున్నారు. బీఆర్ ఎస్ టికెట్ దక్కే అవకాశాలు లేకపోవడం, కాంగ్రెస్ నుంచి సానుకూల సంకేతాలు రావడంతోనే ఆయన దామోదర రాజనర్సింహతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే స్టేషన్‌ఘన్‌పూర్ కాంగ్రెస్‌లో కీలకంగా పనిచేస్తున్న సింగపురం ఇందిర ఇటీవల టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా రాజయ్యను కాంగ్రెస్‌లోకి రప్పించడం ద్వారా ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశాలుంటేనే పిలుపునిచ్చారనే అంశంపై చర్చ జరుగుతోంది.