- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాజకీయ కక్షతోనే మంత్రి శ్రీధర్ బాబు పై పుట్ట మధు విమర్శలు
దిశ, కాటారం : రాజకీయ కక్షతోనే మంత్రి శ్రీధర్ బాబు పై అసత్య ఆరోపణలు చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో అన్నారు. కాటారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ డెలివరీ పక్రియా సరిగా లేక భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రికి తరలించినట్లు అనంతరం ప్రసవం లో శిశువు మరణించడం చాలా బాధాకరమని, కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి సానుభూతి వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఈ సందర్భాన్ని రాజకీయ స్వలాభం కోసం మంత్రి శ్రీధర్ బాబు మీద అసత్య ఆరోపణలు చేస్తూ శవ రాజకీయాలు చేస్తూ పబ్బం గడిపేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. మహిళా డాక్టర్ అయినటువంటి ఒక దళిత బిడ్డ వైద్య వృత్తిని ఎంచుకుని కష్టపడి చదివి డాక్టర్ అయ్యి మండలంలో వైద్య సేవలు అందిస్తుందని అన్నారు.
అనునిత్యం రోగులకు అందుబాటులో ఉండాలని హాస్పిటల్ దగ్గర్లోనే నివాసం ఉంటూ విధులు నిర్వహిస్తుందని తెలిపారు. ఇప్పటివరకు ఆ వైద్యురాలు 76 డెలివరీలు చేసి రెండు సార్లు ఉత్తమ వైద్యురాలిగా అవార్డు అందుకోవడం జరిగిందని అన్నారు. అటువంటి వైదరాలిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా శిశువు మరణానికి కారణం వైద్యురాలని ఆరోపణలు చేసి రోజు రోజుకి మీ స్థాయిని మీరే దిగజార్చుకుంటున్నారని మండిపడ్డారు. వైద్యులు రోగుల ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు కేవలం 10 నెలలలోనే మంథని ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారు.
మంథని ప్రాంతంలో మీరు బహుజన వాది అనే ముసుగులో నడిరోడ్డు మీద హత్యలు, దళితులను కుల పేరుతో దూషించే చరిత్ర, అలాగే లాక్ అప్ డెత్ లు, ఇసుక లారీల వలన వందల మంది మరణిస్తే ఏ ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టి వారి కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. ఈరోజు మీ అధికారం పోవడంతోనే మంథని ప్రజలు శాశ్వతంగా మరిచిపోతారనే నెపంతో ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా దానిని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తూ మంత్రి శ్రీధర్ బాబు పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మీకు ఏనాడు దళితుల పట్ల గానీ బహుజన పట్ల గాని ప్రేమ లేదని, కేవలం రాజకీయ స్వలాభం కోసం బహుజన వాదాన్ని వాడుకుంటున్నట్లు విమర్శించారు.మరోసారి మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబు పై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.