- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ తోనే ప్రజాసంక్షేమం.. శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ శ్రీను బాబు
దిశ, కాటారం : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజాసంక్షేమం అభివృద్ధి జరుగుతుందని, కాంగ్రెస్ అభ్యర్థి దుదిల్ల శ్రీధర్ బాబును అధిక మెజార్టీతో గెలిపించాలని శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శ్రీను బాబు విజ్ఞప్తి చేశారు. శనివారం గారేపల్లిలోని వ్యాపార కూడలిలో ఇంటింటికి ఆరు గ్యారెంటీల కార్డుతో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలోనే మంత్రి నియోజకవర్గం ఆదర్శవంతంగా అభివృద్ధి చేయడానికి శ్రీధర్ బాబు మేనిఫెస్టో నిర్ణయించారని , అన్ని వర్గాల ప్రజల సంక్షేమం చేపట్టడానికి అన్ని అంశాలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచారని శ్రీనుబాబు పేర్కొన్నారు. మండలంలోని కాటారం కొత్తపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు శ్రీనిబాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
సింగిల్ విండో చైర్మెన్ కాంగ్రెస్ లో చేరిక
మహదేవపూర్ సింగిల్ విండో చైర్మన్ చల్లా తిరుపతయ్య ఎంపీటీసీ చల్ల రమ టీఆర్ఎస్ కు రాజీనామా చేసి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణ రాబోయే కాలంలో శ్రీధర్ బాబు ఆధ్వర్యంలోనే మంత్రి నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్న ఆశాభావంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చల్లా తిరుపతయ్య తెలిపారు. తల్లా తిరుపతయ్య ఎంపీటీసీ చర్ల గ్రామాలకు కాంగ్రెస్ కండువాలు వేసి పార్టీలోకి శ్రీధర్ బాబు స్వయంగా ఆహ్వానించారు. అనంతరం శ్రీధర్ బాబు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.