ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

by Naresh |   ( Updated:2024-03-01 15:58:35.0  )
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
X

దిశ, వరంగల్ టౌన్‌: తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ముందుకెళ్తామని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 19 డివిజన్ భగతసింగ్ నగర్‌లో జిల్లా కలెక్టర్ పీ.ప్రావీణ్య, అధికారులతో కలిసి మంత్రి సురేఖ ‘మహాలక్ష్మి పథకం’ ‘గృహ జ్యోతి’ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. లబ్దిదారులకు 200 యూనిట్ల విద్యుత్ జీరో బిల్లును అందించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ… గత మంగళవారం ముఖ్యమంత్రి చేతులమీదుగా మంత్రులతో కలిసి రాష్ట్ర స్థాయిలో మహాలక్ష్మి పథకం, గృహ జ్యోతి పథకాలను ప్రారంభం జరిగిందన్నారు. నేడు జిల్లా కేంద్రాల్లో ప్రారంభించు కొంటున్నామని అన్నారు. పేదల ఇళ్లలో వెలుగులు నింపాలనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని అన్నారు. మహాలక్ష్మీ పథకం కింద సబ్జిడీతో రూ. 500 గ్యాస్ సిలిండర్‌ అందిస్తున్నామని తెలిపారు. గృహ జ్యోతి పథకం క్రింద వరంగల్ తూర్పు నియోజక వర్షంలో లక్ష 45 వేల మంది, మహాలక్ష్మి పథకం కింద లక్ష 50 వేల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ప్రజాపాలన లో దరఖాస్తు చేసుకున్న వాళ్లకే ఈ పథకాలు వర్తిస్తాయని, ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. దరఖాస్తు చేసుకొని వారు ప్రజాపాలన లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని.. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రెండు హామీలైన రూ. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు చేశామని మంత్రి గుర్తు చేశారు. నూటికి నూరు శాతం హామీలను అమలు చేస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ఎట్టి పరిస్థితుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర పాలన చేస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మోహన్ దాస్, ఎస్‌ఈ మధుసూదన్, జిల్లా పౌర సరఫరా, విద్యుత్, రెవెన్యూ, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read More..

TPCC ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి నోటీసులు

Advertisement

Next Story

Most Viewed