- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్
దిశ, వరంగల్ బ్యూరో : ప్రజావాణిలో పలు సమస్యలపై స్వీకరించిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి తో కలసి ప్రజల నుండి కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రజల నుండి పలు సమస్యలపై (122) ఆర్జీలను కలెక్టర్ స్వయంగా స్వీకరించి ఆయా దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, ఆయా సమస్యలను మానవతా దృక్పథంతో త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. నేటి ప్రజావాణి లో రెవెన్యూ శాఖకు సంబంధించి 36, జిల్లా పరిషత్ 18, కలెక్టరేట్ 10, జి డబ్ల్యు ఎం సి- 8, డి ఆర్ డి ఓ-6, జిల్లా పంచాయతీ అధికారి -8, విద్యాశాఖ -6, లీడ్ బ్యాంక్ మేనేజర్-5, వైద్య ఆరోగ్య శాఖ-5, పోలీస్ శాఖ-4,ఇతర సమస్యలపై 16 దరఖాస్తులు వచ్చాయి.
ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రగతి పై సమీక్షించిన కలెక్టర్
ప్రజావాణి అనంతరం ఇందిరమ్మ ఇళ్ల సర్వే పురోగతిని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా సమీక్షించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చేందుకు మొబైల్ యాప్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్ధాయిలో ఇబ్బందులు, ఇప్పటివరకు సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన వివరాల గురించి అధికారులతో తెలుసుకున్నారు. వివరాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.
తక్కువగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే నమోదులో వెనుకంజలో ఉన్న మండలాల ప్రత్యేక అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని గ్రామస్థాయిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పూర్తి చేయాలన్నారు. పీఎం ఆవాస్ యాప్‌లో సర్వేయ ర్లు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి తప్పిదాలకు తావులేకుండా వివరాలను సేకరించి ఇందిరమ్మ యాప్‌లో లాగిన్ అయ్యి వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. నిర్ణీత గడువులోగా సర్వేను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డిఆర్ఓ విజయలక్ష్మి, డిఆర్డిఓ కౌసల్య దేవి, జెడ్పీ సీఈవో రామ్ రెడ్డి, ఆర్డీవోలు సత్యపాల్ రెడ్డి, ఉమారాణి , జిల్లా అధికారులు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.